Movies

ఉదయకిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

చిత్రం మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలిచిత్రంతోనే మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయకిరణ్. నువ్వు నేను,మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో తిరుగులేని హీరో అయ్యాడు. నువ్వు నేను మూవీలో చేసిన నటనకు 2001లో ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. తమిళనాట కూడా యువ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. కానీ తలరాతను ఎవరూ తప్పించలేరన్నట్లు చిన్న వయస్సులోనే ఆత్మహత్యకు పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి, అప్పుడే ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ అతడి భార్య విషిత కన్నీళ్లు కారుస్తూనే ఉంది. ఉదయ్ పేరుమీద తన కొద్దిపాటి జీతంలోంచి కొంత మొత్తం వెచ్చించి, జయంతి ,వర్ధంతికి సేవా కార్యక్రమాలు , పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తోంది.

సినిమాల్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏమౌతుందో ఎవరికీ తెలీదు. పైకి ఎదగడం, కిందికి పడిపోవడం ఇక్కడ సర్వ సాధారణం. సెన్షేషనల్ హిట్స్ తో దూసుకుపోయిన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాకపోవడంతో అలమటించిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తో నిశ్చితార్ధం కేన్సిల్ కావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది.

క్రమేపి సినిమాలు తగ్గిపోయాయి. ఛాన్స్ ఇమ్మని అడగలేక , సినిమాల్లో ఎవరూ ఛాన్స్ ఇవ్వక, తనలో తానే కుమిలిపోయిన ఉదయ్ 2014జనవరి 5న సూసైడ్ చేసుకుని తనువు చాలించాడు. ఇక ఉదయ్ కి అంతకు ముందు పెళ్లి అయింది. విషిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాక ఏడాది పాటు ప్రేమ వ్యవహారం నడిచాక పెళ్లిచేసుకున్నారు. అప్పటికే ఓ కార్పొరేట్ సంస్థలో విషిత ఉద్యోగం చేస్తోంది.

ఇక ఉదయ్ కెరీర్ కూడా అప్పటికే తగ్గిపోవడం,అప్పులు పెరగడం వంటి కారణాలతో పెద్దిల్లు ఖాళీ చేసి శ్రీనగర్ కాలనీలో మరో ఇంటికి మారాడు. ఓ రోజు విషిత ఆమె ఫ్రెండ్ రోహిత్ బర్త్ డే పార్టీకోసం మణికొండ వెళ్ళింది. అదే సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఉదయ్ ప్రాణాలు విడిచాడు.’ఒకప్పుడు ఎంతో హ్యాపీగా జీవించాం. కానీ ఉదయ్ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడు’అని ఆమె కన్నీళ్ల పర్యంతం అవుతోంది.

స్టార్ డమ్ నుంచి బయటకు వచ్చేయాలని ఎంతనచ్చజెప్పినా వినలేదని, స్టార్ హీరోగానే భావిస్తూ గడిపేవాడని ఆమె చెప్పుకొచ్చింది. ఆ డిప్రెషన్ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని విచారం వ్యక్తంచేసింది. శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండ లోని పేరెంట్స్ దగ్గరకు షిఫ్ట్ అయిన విషిత, ఓ అంధుల పాఠశాలలో ఉదయ్ 5వ వర్ధంతి సందర్బంగా దుస్తులు ,పుస్తకాలు అందజేసింది.