Movies

సినిమా పిచ్చితో సినిమాల్లో సంపాదించిన మొత్తం సినిమాల్లోనే పోగొట్టుకున్న ఈ నటి వింత కథ చూడండి

నటన అనేది పుట్టుకతో వచ్చేది. నటన పిచ్చితో ఎవరినీ ,దేన్నీ లెక్కచేయరు కొందరు. అంతగా కమిట్ మెంట్ ఉంటుంది. ఇక ఊరిపేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కాకినాడ శ్యామలను ఓరోజు అర్ధరాత్రి పైగా హోరున వర్షం కురుస్తుంటే ఇంటినుంచి సొంత అన్నయ్య గెంటేసాడు. ఇక ఇళ్ళు,భూములు,నగలు పోయాయి. అయినా నటనపై మమకారం పోలేదు. అసలు విషయంలోకి వెళ్తే,రంగస్థలం నుంచి సినీ రంగానికి వచ్చిన శ్యామల నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మించి చేతులు కాల్చుకుంది. అయినా నటన దాహం తీరలేదు. దాదాపు 200పైగా చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్టు పాత్ర ల్లో నటించింది. తమిళంలో కూడా ఈమె కేరక్టర్ ఆర్టిస్టుగా వేసింది. పాటలు పాడే ఛాన్స్ కోసం చూసిన ఈమె నాటకాల్లో నటి అయింది. ఆతర్వాత సినిమా రంగ ప్రవేశం చేసింది. కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సరే,ఇప్పటికీ సినిమాయే జీవితంగా బతుకుతోంది.

మరో చరిత్ర, గుప్పెడు మనసు, శ్రీవారికి ప్రేమలేఖ,ఆనంద భైరవి,దశ తిరిగింది,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ,మొగుడూ పెళ్ళాలు,నాలుగు స్తంభాలాట, మూవీల మొదలుకుని, ఆకాశంలో సగం వరకూ ఆమె 3న్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ప్రస్థానం సాగిస్తోంది. 8వ తరగతి వరకూ చదువుకున్న ఈమె స్వస్థలం కాకినాడ. ఈమె ఒకరోజు ఇంటిముందు కూనిరాగాలు తీస్తుంటే, అటుగా వెళ్తున్న దర్శకుడు బి ఎన్ ఆర్ పలకరించి, కంఠం బాగుంది,నాటకాల్లో వేస్తావా అని అడిగారట.

సరిగ్గా అదేసమయంలో ఎస్వీ రంగారావు, నిర్మలమ్మ,శారద ,చలం వంటి ఉద్దండ నటులు కాకినాడలో నాటకం వేయడానికి రావడంతో నాటకం ఇలా ఉంటుందని బి ఎన్ ఆర్ చూపించారు. గురి కుదిరిన ఆమె ‘వేరుపడి తీరాలి’అనే నాటకంతో నాటకరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే శ్యామల అన్నయ్య మచిలీపట్నం పోర్టులో ఉద్యోగం చేసేవాడు. సెలవుల్లో ఊరికి వచ్చిన అతడికి పలానా వాడి చెల్లి నాటకంలో వేసిందహో అంటూ ఎవరో ఆకతాయి గోడమీద రాసిన రాతలు చూసి అతడు ఆవేశంతో ఊగిపోయాడు. నిజానికి ఆడవాళ్లు నాటకం వేయడం అతడికి నచ్చదు.

అందుకే ఇంటికొచ్చి,ఒక్క నాటకంలో సరదాగా వేసిన శ్యామలను బెల్ట్ తో చితక కొట్టేసి,పెట్టె విసిరేసి, అర్ధరాత్రి వేళ వర్షం కురుస్తున్నా సరే, బయటకు గెంటేసాడు. దీంతో ఉక్రోషంతో నాటకంలో తనకు వదినగా నటించిన సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అయితే మైనార్టీ తీరని ఆమెను ఇంట్లో పెట్టుకోడానికి జడిసి ఆమెను వేరే ఇంట్లో ఆ రాత్రికి ఉంచింది. ఇక తెల్లారేసరికి వాళ్ళన్నయ్య వెతుకుంటూ వచ్చాడు. సినిమాల్లో,నాటకాల్లో నటించడానికి ఒప్పుకుంటేనే వస్తానని శ్యామల భీష్మించింది.

అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కొన్నాళ్ళకు విసుగుపుట్టి సొంతంగా సినిమా తీయాలని భావించి,బి ఎన్ ఆర్ డైరెక్షన్ లో నిత్య సుమంగళి అనే మూవీ తీసింది. నగలు, ఆస్తి తాకట్టుపెట్టి తీసిన ఆ సినిమాలో కృష్ణంరాజు, జయంతి,తదితరులు నటించిన ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ల గొడవల్లో తీవ్రంగా నష్టపోయింది. పోనీ అంతటితో ఆగలేదు, పచ్చబొట్టు అనే సినిమా కసిగా తీయడానికి సన్నద్ధం అయింది. అయితే నాలుగు రీళ్లు తీసాక ఈ మూవీ ఆగిపోయింది. సంపాదించిన ఆస్తులు,స్ధలాలు పోయాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."