బాబాయ్ కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరు ఎవరి పక్కన చేరతారో చెప్పడం కష్టం. మొన్నటి వరకూ బీజేపీతో జతకట్టిన టిడిపి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ,తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు పావులు కదుపుతున్నాడు. ఇక గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి లకు స్ట్రాంగ్ సపోర్ట్ చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈసారి ఒంటరిగా అన్ని సీట్లకు పోటీచేయాలని భావిస్తున్నాడు. అందుకే జనంలోకి యాత్రల ద్వారా దూసుకుపోతున్నాడు. ఆయా పార్టీల నుంచి నేతలు కూడా జనసేనలో చేరుతున్నారు.
టీడీపీ ,వైసిపి లు కూడా తమ రేంజ్ లో పావులు కదుపుతూ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల నడుమ జనసేన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం పార్టీకి సినీ నటుల అండ ఎలాగూ ఉంది. ఇక జగన్ కి కూడా స్టార్ సెలబ్రిటీలు మద్దత్తు ఇస్తున్నారు. పోసాని కృష్ణమురళి,పృథ్వి వంటి నటులు వైసిపి చెంతకు చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం తప్పదన్న రీతిలో చాలామంది టాలీవుడ్ ప్రముఖులు జగన్ వైపు నిలవడానికి ముందుకొస్తున్నారు.
హీరో భానుచందర్,కృష్ణుడు కూడా జగన్ కి మద్దతు ఇస్తున్నారు. తాజాగా స్టార్ కమెడియన్ అలీ కూడా వైసిపి వైపు అడుగులు వేస్తుండడం ఒక్కసారిగా టాలీవుడ్ లో వేడి పుట్టింది. 9న అలీ వైసిపిలో చేరతారని అంటున్నారు. ఈ నేపధ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన నిర్ణయం వెల్లడించాడు. ఇక ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉందని, బాబాయ్ పవన్ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.
ప్రజల మేలు కోసం రాజకీయాల్లోకి బాబాయ్ వెళ్లాడని, తామంతా బాబాయ్ వెంట ఉంటామని చెప్పాడు. బాబాయ్ ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా సరే,ప్రచారంలోకి సైతం వెళ్ళిపోతాననని చెర్రీ మీడియా ముందు ప్రకటించాడు. బాబాయ్ కి చేయకపోతే ఎవరికి చేస్తాం అని ఎమోషనల్ అయ్యాడు. మరి ఈసారి ప్రచారంలో అన్ని పార్టీల నుంచి స్టార్స్ కాంపైన్ బలంగానే ఉండేలా ఉంది.