రజనీ కాంత్ ‘పేట’మూవీ రివ్యూ … హిట్టా…ఫట్టా… ??

గత ఏడాది చివరిలో విడుదలయిన 2.ఓ మూవీతో సత్తా చాటిన సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగకు నేను సైతం అంటూ పేట మూవీ రూపంలో వచ్చాడు. కుర్ర హీరోలకు ధీటుగా స్పీడు పెంచాడా అన్నట్లు కబాలి, కాలా,రోబో 2.ఓ చిత్రాలతో అలరించి,కలెక్షన్స్ రికార్డ్ సృష్టించిన రజనీ తానేమిటో నిరూపించాడు. అన్నీ కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే వచ్చి విజయాన్ని నమోదుచేసుకున్నాయి. ఇక కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో కళానిధి మారన్ నిర్మించిన తమిళ సినిమా పేట గా డబ్బింగ్ అయి ఈవేళ విడుదలయింది. రజని వయస్సు తగ్గిందా అన్నట్లు ఓ యంగ్ స్టార్ లా ఈ మూవీలో కనిపిస్తున్నాడు.

రజనీకాంత్ లుక్ గత సినిమాలకు భిన్నంగా మరింత యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించిన సినిమాగా చెప్పవచ్చు. మంచి స్టైలిష్ గా ఈ మూవీలో కనిపిస్తాడు. ఇక కార్తీక్ సుబ్బరాజన్ కేవలం మూడు సినిమాలతోనే టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఈయన చేసిన తొలిమూవీ పిజ్జా 2012లో వచ్చి,రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ప్రభుదేవాతో మెక్యూరి అనే సినిమా చేసాడు.

కంప్లీట్ మ్యూజిక్ తోనే రన్ అయ్యేలా కొత్తవరవడిలో మూవీస్ తీసే డైరెక్టర్ గా పేరుపొందాడు. అలాంటి కార్తీక్ సుబ్బరాజన్ డైరక్షన్ లో సినిమా చేయాలనీ రజనీకాంత్ స్వయంగా ఎంచుకోవడం విశేషం. సౌత్ ఇండియాలో ఏ హీరోకి లేని క్రేజ్ సొంతం చేసుకున్న రజనీ ఈ మూవీలో యాక్టింగ్ అదిరిపోయింది. విజయ సేతుపతి,నవాజ్ సిద్ధికి తదితరులు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. నవాజ్ సిద్ధికి విలనిజాన్ని కొత్త అర్ధం ఇస్తూ పెర్ఫెక్ట్ గా చేసాడు. రజనీ సరసన సిమ్రాన్ కథానాయికగా నటించింది. అలాగే త్రిష కూడా మరో హీరోయిన్.

ఈ ఇద్దరి యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. రజనీ, త్రిష,సిమ్రాన్ ఒకరికొకరు పోటీపడి నటించారని చెప్పవచ్చు. రజనీ అయితే ఈ మూవీకోసం చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. పాటలు,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ క్లిన్ ఎంటర్ టైన్మెంట్ మూవీగా కనిపిస్తోంది. రోబో 2.ఓ తర్వాత కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే పేట రావడం, అదికూడా సంక్రాంతి బరిలో నిలవడం విశేషం. మూవీ క్రిటిక్స్,విశ్లేషకులు ఈ మూవీపై సానుకూల స్పందన వ్యక్తంచేస్తున్నారు. దీనికి విశ్లేషకులు4/5రేటింగ్ ఇస్తున్నారు.