నటుడు ప్రసాద్ బాబు ‘కోడలు’ టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?కొడుకు కూడా హీరోనే!
తెలుగు సినిమాల్లో నటులకు కొదవలేదు. నటీనటుల శక్తి సామర్ధ్యాలు వారి నటనపైనే ఆధారపడి ఉంటాయి.అలాంటి టాలెంట్ గల నటుల్లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కల్సి నటించిన కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు ఒకడు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా , సపోర్టింగ్ యాక్టర్ గా నటించి, ఇప్పుడు బుల్లితెరపై తాత పాత్రలతో రాణిస్తున్నాడు. చిరంజీవి మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు సినిమాయే ప్రసాద్ బాబుకి కూడా తొలిమూవీ. అందుకే చిరంజీవి నటించిన చిత్రాలైన యముడికి మొగుడు,రుద్రవీణ, జేబుదొంగ వంటి వాటిలో సపోర్టింగ్ పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ని మెప్పించాడు.
ప్రసాద్ బాబు కుటుంబంలో కూడా కొడుకు, కోడలు కూడా స్టార్ నటులే కావడం విశేషం చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టపడే ప్రసాద్ బాబు ఒంగోలుకు చెందిన వ్యక్తి. ఎన్నో నాటకాల్లో వేసిన ప్రసాద్ బాబు అందరిలాగే సినీ రంగంపై మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న రోల్స్ వేస్తూ, ఆతర్వాత విలన్ కేరక్టర్లు వేసే స్థాయికి ఎదిగాడు. మెగాస్టార్ తో సమానంగా సినీ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
జేబుదొంగ , యముడికి మొగుడు,రుద్రవీణ, ఘటోత్కచుడు,త్రినేత్రుడు, అంతులేని కథ,కృష్ణావతారం, అల్లరిమొగుడు,నేటి గాంధీ,మురారి ఇలా ఎన్నో సినిమాల్లో ప్రసాద్ బాబు తన నటనతో రాణించాడు. ప్రసాద్ బాబు మురారి మూవీలో మహేష్ బాబుకి అన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఎన్నో సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా నటించిన ప్రసాద్ బాబు బుల్లితెరవైపు అడుగులు వేసాడు.
పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. జయం,చిన్నకోడలు,రాములమ్మ,వంటి సీరియల్స్ లో నటించాడు. ఇక ప్రసాద్ బాబు కొడుకు, కోడలు కూడా మంచి నటులేనట. ప్రసాద్ బాబుకి ఓ కొడుకు,ఓ కూతురు ఉన్నారు. కొడుకు శ్రీకర్ తమిళం,తెలుగు సీరియల్స్ లో నటించాడు. తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక కోడలు సంతోషి కూడా హీరోయిన్.ఈమె నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో జాగ్రత్త అనగానే చేతిలోవన్నీ కిందికి జారవిడిచి పాత్రధారి ఈమె. ఇక తేజ డైరెక్షన్ లో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమాలో హీరోయిన్ గా సంతోషి నటించింది. ఒక్కడే , బంగారం,ఢీ, సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం సీరియల్ లో నటించింది. తమిళంలో ఎన్నో సీరియల్స్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.