గుప్పెడు మనసు సీరియల్ లో పాప బాహుబలి సింగర్ అని మీకు తెలుసా?
కె బాలచందర్ డైరెక్షన్ లో టివి రంగంలో వచ్చిన సీరియల్ గుప్పెడు మనసు అప్పట్లో ఓ సెన్షేషన్. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా టాప్ మోస్ట్ సీరియల్స్ లో గుప్పెడు మనసు ఒకటి. ఇక ఈ సీరియల్ లో నటించినవాళ్లలో చాలామంది టాప్ రేంజ్ కి చేరారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ సీరియల్ లో నటించిన చిన్నారి దీపికా అంటే ఠక్కున గుర్తొచ్చేది ఆమె ముద్దు ముద్దు మాటలు. ఆ మాటలతోనే తెలుగు,తమిళ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దీపికకు 3ఏళ్ళ వయస్సు ఉండగా అమ్మ అనే సీరియల్ లో నటించింది. దాంతో బాలచందర్ కంట్లో పడింది. దాంతో గుప్పెడు మనసు సీరియల్ లో ఛాన్స్ కొట్టేసింది.
చెన్నైలో సెటిల్ అయిన దీపికా కుటుంబం అంతా గాయకులు కావడం విశేషం. అయితే దీపికా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై కూడా బాలచందర్ మూవీస్ లో నటించింది.తెలుగులో ‘అమ్మా అమ్మను చూడాలని ఉంది’అనే సినిమాలో రమ్యకృష్ణకు ధీటుగా దీపికా నటించి, తానేమిటో చూపించింది. ఐతే వారసత్వంగా నటన కంటే,పాటలు పాడడం అంటేనే ఇష్టమని చెబుతుంది. ఎందుకంటే మూడేళ్ళ వయస్సులోనే నటి శ్రీవిద్య తల్లి అయిన ప్రముఖ సింగర్ వసంత కుమారి జయంతి ఉత్సవాల్లో స్టేజ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చింది. అదే ఆమె తొలిప్రొగ్రామ్.
ఇక 8ఏళ్ళ వయస్సులో దీపికా ఆల్బమ్ కూడా విడుదల చేసి, భళీ అనిపించుకుంది. ఇక లిటిల్ సోల్జియర్స్ సినిమా ప్రస్తావిస్తే పిల్లలకే కాదు చాలామంది పెద్దలకు కూడా చాలా ఇష్టమైన మూవీ. అందులో ‘అయామ్ ఏ గుడ్ గర్ల్ అనే పాటను కూడా దీపికా పాడింది. బాహుబలిలో ‘మమతల తల్లి ‘పాటను తమిళంలో పాడిన దీపికా అక్కడ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంది. తనకు పాటలు తప్ప నటన అనే విషయం పెద్దగా గుర్తుండదు.
కర్ణాటక సంగీతం నేర్చుకున్న దీపికా దేశవిదేశాల్లో వందల కొద్దీ ప్రదర్శనలు ఇస్తోంది. యు ఎస్ ఏ వాళ్ళు ఆర్ట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రాం కి సెలక్ట్ చేసుకున్నారంటే ఈమె ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిటెక్ ఇన్ఫర్ మేషన్ టెక్నలాజి పూర్తిచేసి కూడా మద్రాసు యూనివర్సిటీ నుంచి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ప్రముఖ కళాకారులకు డబ్బింగ్ కూడా చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. మోడల్ గా కూడా రాణిస్తోంది. శక్తి మసాలా ,హెన్కో, కరూర్ వైశ్యా బ్యాంకు ,వంటి అనేక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేస్తూ,రెండు చేతులా సంపాదిస్తోంది. ఆధునిక మహిళగా తన సత్తా చాటిన దీపికా పియానా వాయించడంలో లండన్ లోని ప్రముఖ కళాశాల నుంచి పట్టా అందుకుంది.