Movies

టాలీవుడ్ డైరెక్టర్స్ ఏమి చదివారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

డాక్టర్ కాబోయాను, పెద్ద ఉద్యోగం చేద్దామనుకున్నాను, అలా ఆవుదామనుకున్నాను కానీ సినిమాల్లోకి వచ్చాను అంటూ పలువురు హీరోలు తమ ఇంటర్యూలో చెబుతారు. కానీ డైరెక్టర్లలో కూడా ఇలాంటి బాపతు వున్నారు. ఉన్నత చదువులు చదువుకుని ఈ రంగానికి వచ్చి ఏలుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఇంటర్ , డిగ్రీలు చదివినవాళ్ళే కాదు,ఫారిన్ యూనివర్సిటీల్లో డాక్టరేట్ చేసిన వాళ్ళూ వున్నారు. పాత దర్శకులలో కె రాఘవేంద్రరావు,కె విశ్వనాధ్,డాక్టర్ దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి డైరెక్టర్లు డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక ప్రస్తుత డైరెక్టర్స్ లో వివాదాస్పద దర్శకునిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో ఎక్కుతాడు.

విజయవాడ సిద్దార్ధ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వర్మ మెరిట్ స్టూడెంట్. అయితే సినిమాల మీద ఇంట్రెస్ట్ తో టాలీవుడ్ లో నాగార్జున హీరోగా శివ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వర్మ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఇక రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ గా పనిచేసి, తన పేరుని బ్రాండ్ గా మార్చుకున్న డైరెక్టర్లలో పూరి జగన్నాధ్ ఒకడు. హిట్ వచ్చినా, ప్లాప్ వచ్చినా, బ్రేక్ లేకుండా సినిమాలు తీసే డైరెక్టర్ గా ముద్రపడ్డాడు. విశాఖ జిల్లా పెదగొడిపల్లిలో సెయింట్ థెరిసా ఆర్ సి ఎం స్కూల్ లో చదివాడు.

బాహుబలి మూవీతో తెలుగు చిత్ర స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన అపజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి కేవలం ఇంటర్ వరకే చదివాడు. కర్ణాటక లోని రాయచూర్ లో జన్మించిన జక్కన్న తన తండ్రి విజయేంద్ర ప్రసాద్, సోదరుడు కీరవాణి సినిమా రంగంలో ఉండడంతో స్టడీస్ కి గుడ్ బై చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చేసాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు శిష్యునిగా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

మాటల రచయితగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెసి న్యూక్లియర్ ఫిజిక్స్ పూర్తిచేసాడు. గోల్డ్ మెడల్ సాధించిన ఈయన మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసాడు. ఐదుసార్లు నంది అవార్డు అందుకున్నాడు.
అదేవిధంగా టాలీవుడ్ లో ఎక్కువ విద్యార్హతలు గల దర్శకుడిగా అవసరాల శ్రీనివాసరావు ని చెప్పవచ్చు.

అష్టా చెమ్మా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవసరాల, మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ చేసి,యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి స్క్రీన్ రైటింగ్ డిప్లొమా చేసారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బి ఫార్మసీ చేసాక కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసాడు. ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడిపారు. గమ్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి,కంచె,గౌతమీ పుత్ర శాతకర్ణి,తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలతో తానేమిటో చూపించాడు.

హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల బిటెక్ పూర్తిచేశాక అమెరికాలోని న్యూజెర్సీ లో కంప్యూటర్ లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎం ఎఫ్ ఏ చేసారు. చెన్నై ప్రెసిడెన్సీటీ కాలేజీలో ఇంగ్లీషు లిటరేచర్ గ్రాడ్యుయేషన్ చేసిన రవిబాబు పూణే యూనివర్సిటీలో ఎం బి ఏ చేసారు. ఉషాకిరణ్ మూవీస్ ఆస్థాన దర్శకునిగా ముద్ర పడ్డాడు.

ఇక ఆర్య చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసాడు. కాకినాడ ఆదిత్య కాలేజీలో లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్ 100పెర్సెంట్ లవ్,నాన్నకు ప్రేమతో ,నేనొక్కడినే, రంగస్థలం వంటి మూవీస్ తో తన సత్తా చాటాడు. కొత్త బంగారులోకం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఫిజిక్స్ లో ఎమ్మెసి చేసారు. ఐఐటీలో చదువుతూ సినిమాలపై ఇంట్రెస్ట్ తో మధ్యలో ఆపేసి వచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.