Movies

ఈ బుల్లి సూపర్ స్టార్ తల్లి తండ్రులు కూడా టాప్ హీరో,హీరోయిన్…ఎవరో చూడండి

సినిమాల్లో వారసత్వం కొత్తెం కాదు, ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా హీరో హీరో హీరోయిన్స్ వారసులని పరిచయం చేస్తున్నారు. అదేరీతిలో ఇప్పుడు హీరో సూర్య,హీరోయిన్ జ్యోతిక దంపతుల కుమారుడు దేవ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా హీరోగా వస్తున్నాడట. కేవలం 8ఏళ్ళ వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న దేవ్ కోసం తమిళ ఇండస్ట్రీ, సూర్య ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. యితడు ఎంట్రీ ఇస్తే , సూర్య వంశంలో మూడో తరం రంగప్రవేశం చేసినట్లు అవుతుంది. తమిళనాట అగ్ర హీరోల వారసులు హీరోలుగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వర్మ చిత్రంతో హీరో విక్రమ్ కొడుకు ధృవ్ వెండితెరమీదికి వస్తుంటే,స్టార్ హీరో సంజయ్ కొడుకు విజయ్ డైరెక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నాడు.

కోలీవుడ్ లో ఫాన్ ఫాలోయింగ్ గల హీరోలలో ఒకడైన హీరో సూర్య కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలు తెలుగులో విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సూర్య కొడుకు కూడా కొంత ముందస్తుగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో హీరోగా, కేరక్టర్ ఆరిస్టుగా పనిచేసిన శివకుమార్ తనయుడిగా సినిమాల్లో సూర్య రాణిస్తుంటే, సూర్య తమ్ముడు కార్తీ కూడా హీరోగా వెలుగుతున్నాడు. చిన్న పిల్లల సినిమా చేయడం అంటే ఇష్టపడే సూర్య ఇప్పటికే మేము అనే మూవీ కూడా చేసాడు. ఇక సూర్య వైఫ్ జ్యోతిక స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది.

సూర్య,జ్యోతిక లకు ఒక కూతురు,ఒక కొడుకు ఉన్నారు. 2007లో జన్మించిన కూతురు దియా కి 12ఏళ్ళ వయస్సు.ఇక 2010లో జనించిన కొడుకు దేవ్ అచ్చం జ్యోతిక పోలికలతో స్మార్ట్ గా ఉన్నాడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ పతాకంపై కొత్త దర్శకుని పరిచయం చేస్తూ కొడుకు దేవ్ కీలక పాత్రతో సినిమా తీయబోతున్నాడట.

పెద్దవాళ్ళతో పిల్లాడికున్న బంధం ఇతివృత్తంగా సినిమా డిజైన్ కూడా అయిందట. చైల్డ్ ఆర్టిస్టులతో ఆడిషన్స్ నిర్వహించి 30మందిని ఎంపిక చేయగా, మెయిన్ రోల్ కి ఫైనల్ గా దేవ్ ని ఒకే చేశారట. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాబోతోందట. పిల్లల చదువు దృష్ట్యా పిల్లలను సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించడానికి సూర్య తటపటాయించాడు. అయితే ఆడిషన్స్ లో సరైన చైల్డ్ ఆర్టిస్టు లేకపోవడంతో కొడుకు దేవ్ ని రంగంలోకి దించాలని నిర్ణయించాడు. దీంతో వీళ్ళ కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పాలి.