2019 లో టాప్ 25 బయో పిక్స్
ఇది బయోపిక్ ల కాలం. ఇప్పటికే మహానటి బయోపిక్ వచ్చి సంచలన విజయం సాధించగా, ఆయా భాషల్లో వస్తున్న బయోపిక్ లో పాతికదాకా కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ లోని తొలిభాగం కథానాయకుడు జనవరి9న విడుదలైంది. బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న రెండవ భాగం మహానాయకుడు విడుదల చేస్తారు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కూడా రెడీ అవుతోంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర పేరిట ముమ్ముట్టి టైటిల్ రోల్ తో మహీ రాఘవ డైరెక్షన్ లో ఫిబ్రవరి 8న రాబోతోంది. కత్తివీరుడు కాంతారావు బయోపిక్ పిసి ఆదిత్య డైరెక్షన్ లో రాకుమారుడు పేరుతొ తీస్తున్నారు.
దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు బయోపిక్ దాసరి పేరుతొ నిర్మించడానికి నిర్మాత సి కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. శివసేన అధినేత బాల థాక్రే బయోపిక్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. నవాజుద్దీన్ సిద్ధికి టైటిల్ రోల్ పోషించాడు. టి సిరీస్ గుల్షన్ కుమార్ బయోపిక్ కూడా అక్షయ కుమార్ టైటిల్ రోల్ తో మొఘల్ పేరిట తీస్తున్నారు. కాగా తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ బయోపిక్ ఎంజీఆర్ పేరిట తమిళంలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది సెట్స్ పై వుంది.
అలాగే తమిళ నాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడీ పేరిట ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. నిత్యా మీనన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ప్రియదర్శన్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఇక శృంగార తార షకీలా బయోపిక్ కూడా తీస్తున్నారు. ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్షన్ లో రిచా చద్దా టైటిల్ పాత్ర పోషిస్తోంది.
ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ మణికర్ణిక పేరిట కంగనా రౌనత్ ప్రధాన పాత్రలో జనవరి 25న రిలీజ్ కానుంది. పానిపట్ యుద్ధం బ్యాక్ డ్రాప్ తో అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ లో అర్జున్ కపూర్ ,సంజయ్ దత్ కాంబినేషన్ లో వస్తోంది. సారె జహాసే అచ్చా పేరిట రాకేష్ శర్మ బయోపిక్ షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్ తో వస్తోంది. గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్ సూపర్ 30పేరిట హృతిక్ రోషన్ టైటిల్ పాత్రతో రాబోతోంది.
ఛత్రపతి శివాజీ ఆస్థాన మరాఠా కమాండర్ తానాజీ బయోపిక్ అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో తానాజీగా వస్తోంది. ఐ ఏ ఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ జాన్వీ కపూర్ టైటిల్ రోల్ తో రాబోతోంది.హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ బయోపిక్ ధ్యాన్ చంద్ పేరిట తీస్తున్నారు. ఇందులో ధావన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ బయోపిక్ ’83’ పేరిట రణవీర్ సింగ్ టైటిల్ రోల్ తో వస్తోంది. హవీల్దార్ ఇషార్ సింగ్ బయోపిక్ అక్షయ కుమార్ టైటిల్ రోల్ తో కేసరి పేరుతొ వస్తోంది.
అలాగే క్రీడాకారుడు రుద్రాక్ష జెన బయోపిక్ ‘జంగిల్ క్రై’ పేరిట అభయ్ డియోల్ టైటిల్ రోల్ తో వస్తోంది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ సుధీర్ బాబు ప్రధాన పాత్రతో ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో రానుంది. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ పోషించే సైనా నెహ్వాల్ బయోపిక్ తీస్తున్నారు. ఒలంపిక్ కింగ్ పివి సింధు బయోపిక్ సోనూసూద్ నిర్మాణంలో రాబోతోంది.
ఒలంపిక్ షూటర్ అభినవ్ భింద్రా బయోపిక్ కన్నన్ అయ్యర్ డైరెక్షన్ లో వస్తోంది. అనిల్ కపూర్ , హర్షవర్ధన్ కపూర్ నటిస్తున్నారు. ఇక మహిళా టీమ్ ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ తాప్సి /పిసి ప్రధాన పాత్రలో రాబోతోంది.