లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ గా చేసేదెవరో తెలిస్తే షాక్ తింటారు
సినిమా ఇండస్ట్రీలో సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మూవీ రోజురోజుకి క్రేజ్ ని పెంచేస్తోంది. అదే ఓపక్క నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు,మహానాయకుడు అనే రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తే, అందుకు పోటీగా వర్మ ఈ ప్రాజెక్ట్ చేపట్టాడు. క్రిష్ తీసిన తొలిభాగం ఎన్టీఆర్ కధానాయకుడు ఈనెల 9న విడుదలయింది. ఇక రెండవ భాగం ఫిబ్రవరి 14న వస్తోంది. వెన్నుపోటు, ఎందుకు అనే రెండు పాటలు విడుదలచేసిన వర్మ తాను తీస్తున్న సినిమాలో నిజాలు దాగివున్నాయని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ మళ్ళీ పుడతారంటూ జనవరి 18ఎన్టీఆర్ వర్ధంతి నాడు వర్మ చేసిన ట్వీట్ సంచలనం రేకెత్తించింది. అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్స్ పెంచాడు. ఇక ముందుగా చెప్పినట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ వీడియో కూడా రిలీజ్ చేసాడు. ఇందులో అచ్చం ఎన్టీఆర్ మాదిరిగా నటుడు ఉన్నాడు. ఇది మరింత ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ మళ్ళీ దొగొచ్చారా అంటూ చాలామంది అవాక్కయ్యారు. అసలు ఈ నటుడు ఇంతవరకూ ఎక్కడా నటించినట్లు కనిపించకపోవడంతో ఎవరా ఇలా నటించిందంటూ ఆరా తీయడం మొదలెట్టారు.
సోషల్ మీడియాలో దీనిపై చర్చలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కంటే,వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పబ్లిసిటీ ఎక్కువగా వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ స్టేజ్ యాక్టర్ ఎన్టీఆర్ పాత్ర పోషించాడని,అసలు ఎన్టీఆర్ లా ఎలా నటించాలో కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చానని వర్మ చెప్పుకొస్తూ ఓ ట్వీట్ వదిలాడు. ఎన్టీఆర్ హావభావాలు, సభల్లో ప్రసంగాలు, భావోద్వేగాలు ఇలా అన్నింటా ఎన్టీఆర్ ని తీర్చిదిద్దుతున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. మరి విడుదలయ్యాక ఈ మూవీ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.