Republic Day History

జనవరి 26 నుంచి అధికారంలోకి వచ్చిన ‘జాతీయ చిహ్నం’ గురించి ఈ విషయాలు తెలుసా?

గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజునే అని చెబుతారు. మరి అదే రోజు నుంచి అంటే 1950 జనవరి 26 నుంచి మన ‘జాతీయ చిహ్నం’ కూడా అధికారికంగా అమల్లోకి వచ్చింది.

1.నాలుగు సింహాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉన్న ఈ చిహ్నం వెనకాల ఘన చరిత్ర ఉంది.
2. క్రీ. పూ.3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు ఘన రాజ్యంలో అక్కడక్కడ అనేక స్తంభాలను కట్టించి వాటి పై శాశనాలు వేయిమ్చాడు. వీటినే ‘పిల్లెర్ ఆఫ్ అశోక’ అంటారు.
3. సారనాథ్ లో బుద్దుడు తొలిసారి తన శిష్యులకు ధర్మాన్ని భోదించాడని చెబుతారు. దానికి గుర్తుగా అశోకుడు తన భార్య రాణి విదిశాదేవి కోరిక మేరకు అక్కడ నాలుగు సింహల ముఖాలతో కూడుకున్న ఓ స్తంభాన్ని చెక్కించాడు. దిన్ని ‘లయన్ ఆఫ్ అశోకా’ అంటారు. నాడు అశోకుడు చెక్కించిన విగ్రహం ఎప్పటికి వారణాసి సమీపంలో ఉన్న సారనాథ్ లో భద్రపరిచారు. దీన్నే భారత ప్రభుత్వం అధికారిక చిహ్నంగా తీసుకుంది.

4. చిహ్నంలో తామర పువ్వులాంటి ఓ గద్దె పై గుండ్రని దిమ్మె ఉంటుంది. దాని పై నాలుగు వైపులా ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం విగ్రహాలు ఉంటాయి. వీటి మద్యలో ధర్మ చక్రాలు ఉంటాయి. అందులోని చక్రాన్నే మాన్ జాతీయ జెండాలో రూపొందించారు. ఇక ఈ నాలుగు జంతువులు బుద్దుని జీవితంలోని నాలుగు దశలకు సుచికలుగా చెబుతారు. అంతే కాదు వీటి నాలుగు దిక్కుల ముఖాలు అశోకుడి అన్ని వైపులా పాలనను కూడా చూసిస్తాయి.
5. ఈ చిహ్నం కింద దేవనాగరి లిపిలో కనిపించే ‘సత్యమేవ జయతే’ అన్నమాట ముండకోపనిషత్ నుంచి గ్రహించారు.
6. ఈ అధికార చిహ్నం మన కరెన్సీ నోట్ల దగ్గర నుంచి ప్రభుత్వం ఎన్నో అధికారక ముద్రల కోసం వాడుతుంది.
7.ఎవరైనా మన అధికారిక చిహ్నాన్ని కించపరిచేలా వాడడం చట్టరిత్య నేరం.