క్యాన్సర్ రావటానికి ప్రధానంగా కారణాలు ఏమిటి?
క్యాన్సర్‌కు ప్రధానంగా నాలుగు కారణాలుగా చెప్పవచ్చు. జన్యుపరమైన కారణాలు (వంశపారంపర్యంగా సంక్రమించేవి),కాలుష్యం, పర్యావరణం,జీవనశైలి,ఆహారపుటలవాట్లు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి రోజుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగాయి. మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వాతావరణంలో కూడా విపరీతమైన కాలుష్యం పెరిగిపోయింది. ఈ అంశాలు అన్ని శరీరంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఎంతటి ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో పెరిగినా జన్యువుల్లో క్యాన్సర్ కారకం ఉంటే వంశపారంపర్యంగా క్యాన్సర్ సంక్రమించవచ్చు. అయితే ఈ రకమైన క్యాన్సర్లు 30 నుంచి 35 ఏళ్ల లోపే బయల్పడతాయి. అయితే క్యాన్సర్ కారకాల్లో వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలను, పర్యావరణ మార్పుల వల్ల క్యాన్సర్ సంక్రమించే అవకాశాలను నియంత్రించలేకపోయినా, ఆహారపుటలవాట్లు, జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకునే వీలు మన చేతుల్లోనే ఉంది.