బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు,నివారణ ఎలా?
ప్రస్తుతం మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ పురుషుల్లోనూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ… మహిళల్లో వచ్చే ఛాన్స్ వందశాతం ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలతోపాటు… చికిత్స, నివారణపై అవగాహన పెంచుకోవల్సిన అవసరం ఉంది.
1. రొమ్ములోని కొంత భాగంలో లేదా మొత్తం భాగంలో వాపు.
2. చర్మంపై దురదలు
3. రొమ్ములో విపరీతమైన నొప్పి
4. పాలిండ్లలో నొప్పి, పాలిండ్లు లోపలికి వెళుతుండటం
5. రొమ్ముపైగల చర్మం ఎరుపపెక్కడం, గట్టిపడటం.
కొన్ని సార్లు రొమ్ము క్యాన్సర్‌ని ప్రారంభంలో గుర్తించడం కష్టం. గడ్డలు ఏర్పడినా, ఏదానా అసాధారణమైన లక్షణాలు,లేదా పైన వివరించిన లక్షణాలలో ఏవైనా మీలో కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించండి.