వందేమాతరం నుండి ‘కల్కి’ వరకు డాక్టర్ రాజశేఖర్ ప్రయాణం ఎలా సాగిందో చూడండి

చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ సినీ హీరో రాజశేఖర్ నటుడి కన్నా ముందే నిజంగా డాక్టర్. సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎమ్.బి.బి ఎస్ చేసి చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ కూడా పెట్టాడు. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలై అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని లక్ష్మీపురంలో జన్మించాడు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా ‘పుదుమాయ్ పెన్’ చిత్రంతో తెరంగట్రం చేసాడు.

ఆ తర్వాత 1985 లో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తెరమీద హీరోగా రాజశేఖర్ నటనకు తెరవెనుక డబ్బింగ్ తో సాయికుమార్ ప్రాణం పోసేవాడు. వీరిద్దరి కాంబినేషన్ వల్లే రాజశేఖర్ ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.వందేమాతరం తర్వాత నటుడుగా గుర్తింపు తెచ్చే సినిమాలు చేసినా, ‘తలంబ్రాలు’ మూవీ బ్రేక్ ఇచ్చింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు బెస్ట్ విలన్‌గా మెప్పించాడు.

ఈ సినిమా కథ,కథనం,పాటలు కూడా కొత్త దనం వలన సూపర్ హిట్ అయ్యింది. రాజశేఖర్, జీవిత నటించిన ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా చేసిన మూవీస్ సూపర్ హిట్ కొట్టాయి. ఇక వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకోవడమే కాదు రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ భార్యభర్తలయ్యారు. మగాడు,శివయ్య, అంకుశం,ఆగ్రహం, ఎవడైతే నాకేంటి వంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మాన్ గా కనిపించిన డాక్టర్ రాజశేఖర్ ఆతర్వాత మా అన్నయ్య, అక్క మొగుడు,అల్లరి ప్రియుడు, ఇలా ఫ్యామిలీ ప్రేక్షకులనుమెప్పించాడు.

రాజ శేఖర్ కెరిర్లో ‘శ్రుతిలయలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘అన్న’, అల్లరి ప్రియుడు’ ‘శివయ్య’, ‘మనసున్నమారాజు’, ‘మా అన్నయ్య’, సింహరాశి, ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ లేటెస్ట్‌గా ‘ గరుడ వేగ’ లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కెరీర్ లో .హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డాడు.

గతేడాది ‘‘గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాతో రాజశేఖర్ మరో సక్సెస్‌ను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.