Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూడండి

శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 06

శ్రీ వికారి నామ సంవత్సరంలో మేష రాశివారికి గురు గ్రహ ప్రభావం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది.గురు గ్రహం వలన ది.03-నవంబర్-2019 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. చేసే పని ప్రారంభంలో సానుకూలంగా ఉన్నా చివరకు వచ్చే సరికి కొన్ని సమస్యలు వస్తాయి. 04-నవంబర్ – 2019 నుండి గురువు అనుకూలమైన ఫలితాలను అందిస్తాడు. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన స్థాయిలో సంపాదన ఉంటుంది. ఈ సంవత్సరం ఫైనాన్సు వ్యాపార రంగంలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. నూతన వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన సమయం.

అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించును. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మీరు అనుకున్న చోటుకి ప్రమోషన్స్ వస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మంచి సమయం. అలాగే వ్యవసాయం చేసేవారికి కూడా మంచి అనుకూలమైన సమయం. శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సంవత్సరం అంతా చక్కటి ధన లాభాలు కలుగచేయును. రాహు – కేతువులు ఇద్దరూ సంవత్సరం అంతా మంచి చేయరు. చక్కగా జరుగుతూ ఉన్న పనులలో భంగములు, ధన వ్యయములు కలిగిస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.