Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఎలా ఉంటుందో చూడండి

మిధున రాశివారికి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 02 అవమానం – 02.మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 03-నవంబర్-2019 వరకూ అనవసర వృధా ఖర్చులు,ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో తగాదాలు వంటివి కొంచెం చికాకును కలిగిస్తాయి. నవంబర్ 4 నుంచి సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. మిధున రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆర్ధికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి.

ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత గృహ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో భాగస్వాముల కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. శ్రీ వికారి నామ సంవత్సరంలో మిధున రాశివారికి రాహువు – కేతువు ఇరువురూ మిశ్రమ ఫలితాలను కలిగిస్తారు. మిధున రాశివారికి శని గ్రహం మంచి ఫలితాలను ఇవ్వడు. 23-జనవరి-2020 వరకూ ఆర్ధికంగా మంచి ధనాదాయం కలుగచేయును. 24-జనవరి-2020 నుండి కొంచెం ఖర్చులు పెరుగుతాయి.