అలనాటి హీరోయిన్ విజయలలిత గుర్తు ఉందా… ఈమెకు విజయశాంతికి ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా?
ఆరోజుల్లో మత్తెక్కించే కళ్ళతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న నటి విజయలలిత అని చెప్పక తప్పదు. సూపర్ కృష్ణ భార్య ,దర్శకురాలు,నటి విజయనిర్మల సొంత ఆడపడచు ఈమె. విజయనిర్మల తొలిభార్త కె.ఎస్.మూర్తి చెల్లెలు అయిన విజయలలిత స్వయానా లేడి అమితాబ్ బచ్చన్ కి పిన్నమ్మ. అందుకే విజయశాంతిని సినిమాల్లోకి విజయ లలిత తీసుకొచ్చింది. ఐటెం గాళ్ గా వచ్చిన విజయలలిత డాన్స్ చేసినా, ఫైట్స్ చేసినా సరే, జనం విరగబడేవారు.
ఎన్టీఆర్, అక్కినేని వంటి ఆనాటి అగ్ర హీరోలందరి సరసన నటించిన విజయలలిత ఆతర్వాత కృష్ణ , శోభన్ బాబు వంటి నటులతో నటించింది. రౌడీ రాణి, చలాకి రాణి కిలాడీ రాజా, భలే రంగడు, మనుషుల్లో దేవుడు, కదలడు వదలడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ లో దాదాపు 850సినిమాల్లో నటించిందంటే ఆమె క్రమశిక్షణ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.
క్రమశిక్షణతో నట జీవితాన్ని నిలబెట్టుకున్న ఈమె ఉదయం 7గంటలకు కాల్ షీట్ ఉంటె ఆరు గంటలకే మేకప్ వేసుకుని రెడీగా వెళ్లేది. ఫ్లోర్ గేట్ తాళం తీయకపోయినా వాచ్ మెన్ వచ్చేవరకూ అక్కడే వెయిట్ చేసేది. అందుకే ఆమె అగ్రపథాన దూసుకువెళ్లింది. కొన్ని హిందీ మూవీస్ లో కూడా నటించిన విజయలలిత ఆతరవాత నిర్మాతగా,దర్శకురాలిగా మారి ఎన్నో సినిమాలు తీసింది.
హీరోయిన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె కొంతకాలానికి గయ్యాళి అత్త పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ మూవీ సాహస వీరుడు సాగర కన్య మూవీలో మంత్రగత్తె పాత్రలో నటించి ఆడియన్స్ మెప్పు పొందింది. ఆతరవాత సినీ రంగం నుంచి తప్పుకుని ఇంటికే పరిమతమై కుటుంబంపై దృష్టి పెట్టింది. అయితే ఇటీవల బుల్లితెరపై కనిపించడంతో నెటిజన్లు సైతం ఆమె గురించి తెలుసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు.