రెమ్యునరేషన్ విషయంలో ఎవరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్న రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ హిట్ మీద హిట్ అందుకుంటున్నాడు. 2.ఓ మూవీ సంచలన విజయం తర్వాత సంక్రాంతికి వచ్చిన పేట మూవీ కూడా 200 కోట్లకు పైగా వసూలు చేసి,బాక్సాఫీస్ దగ్గర 25రోజులు దాటినా రన్నింగ్ ఆగలేదు. ఇక వ్యక్తిగత విషయంలోకి వస్తే రజనీ కాంత్ రెండవ కూతురు సౌందర్య మేరేజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈనెల 11న ఆమెకు పెళ్లి జరుగుతున్నట్లు చెబుతున్నారు.

పెళ్లి హడావిడి పూర్తయితే,ఏ ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మూవీ చేయడానికి రజనీ సన్నద్ధం అవుతాడట. అయితే దీనికి భారీగా రెమ్యునరేషన్ ఈ మూవీకి తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే, శంకర్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 2.ఓ మూవీకి రికార్డులు బద్దలు కొట్టినా,ఈ మూవీకి లాభాలు రాలేదట. ఈ మూవీకోసం 543కోట్ల రూపాయలను లైకా సంస్థ ఖర్చు చేసింది. ఈ మూవీకి 60కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న రజనీ చిత్రానికి లాభం రాకపోవడాన్ని గుర్తించారు.

అందుకే మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చే సినిమాకు రెమ్యునరేషన్ తగ్గించుకుని లైకా సంస్థకు న్యాయం చేయాలని రజనీ నిర్ణయించాడట. ఇక ఈ మూవీ పొలిటికల్ మూవీ కాదని, అందరినీ అలరించేలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుందని ఓ ఇంటర్యూలో మురుగుదాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న మురుగుదాస్ మూవీ మార్చిలో పట్టాలెక్కనుంది.