Movies

ఈ హీరోయిన్ ఎక్కువగా అగ్ర హీరోలకు తల్లిగా నటించింది… ఎవరో గుర్తు పట్టారా?

సినిమా రంగంలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎక్కువమంది వస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అవుతారు. మరికొందరు కొంతమేరకు విజయం నమోదుచేసుకుని వేరే పాత్రలవైపు దృష్టిపెట్టి రాణిస్తారు. వయస్సు చిన్నదయినా పెద్ద పెద్ద పాత్రలు పోషిస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ పండరీ బాయిని తలచుకోవాలి. 1960,70ల్లో తెలుగు సినిమాల్లో తల్లి అంటే ఈమెనే చెప్పితీరాలి. చిన్నప్పుడే రంగస్థలంపై తన ఉనికి చాటిన ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఈమెకు ఇద్దరు కొడుకులు. అయితే ఎవరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.

తెలుగు తమిళ కన్నడ రంగాల్లో దాదాపు1500సినిమాలకు పైనే నటించింది. నాటక రంగం నుంచి కన్నడ రంగానికి వాణి అనే పేరుతొ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పండరీబాయి కి తొలిమూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో స్టార్ హీరోయిన్ గా ఓవర్ నైట్ మారిపోయిన ఈమె కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ వంటి వారితో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ఆతర్వాత సపోర్టింగ్ కేరక్టర్ కి షిఫ్ట్ అయింది. అదికూడా ఎక్కువగా తల్లిపాత్రల్లోనే కనిపించేది. ఆరోజుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ, శోభన్ బాబు ఇలా చాలామంది అగ్ర హీరోలకు తల్లి గా నటించి మెప్పించిన పండరీ బాయి వయస్సు చూస్తే వీరందిరి కన్నా చిన్నది.

టాలెంట్ గల ఈమె ఆరోజుల్లోనే స్టార్ హీరోలకు తల్లిగా నటించి కరుణ రసం కురిపించి, ఆడియన్స్ హృదయాలను కరిగించింది. అంతేకాదు ఈమె షెడ్యూల్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఆరోజుల్లో వచ్చిందంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమెకున్న స్టార్ డమ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. 75ఏళ్ళ వయస్సులో కన్నుమూసిన ఈమె టివి సీరియల్స్ లో కూడా తన సత్తా చాటింది. తల్లి పాత్ర అంటే ఈమె ఠక్కున గుర్తొస్తుంది.