అంబానీ కొడుకు ఆకాష్ పెళ్ళి కార్డ్ లో ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

గొప్పింటి పెళ్లిళ్లు మాములుగా ఉండవని అంబానీ నిరూపించాడు. ఎందుకంటే ఇప్పటీకే కూతురు ఇషా అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసిన అంబానీ ఇప్పుడు కొడుకు పెళ్ళికి సమాయత్తం అవుతున్నాడు. కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లిని మార్చి 10వ తేదీన జరిపించేందుకు ముహూర్తం కూడా పెట్టేసారు. ప్రముఖ డైమండ్ వ్యాపారి రెసల్ మెహతా కూతురు శ్లోకా మెహతాతో వివాహానికి రెడీ అవుతున్నారు. 2018 జూన్ లో జరిగిన ఎంగేజ్ మెంట్ ని చాలా గ్రాండ్ గా చేసారు. ఇక పెళ్లంటే ఎలా చేస్తారో చెప్పక్కర్లేదు.

పెళ్లి కార్డుల పంపిణీలో ఇరు కుటుంబాలు యమ బిజీగా ఉన్నాయి. తండ్రి ముఖేష్ అంబానీ వ్యాపారంలో చేదువాదోడుగా ఉంటున్న ఆకాష్ రిలయన్స్ సామ్రాజ్యం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో కీలక పాత్ర వహిస్తున్నాడు. అందుకే ఆకాష్ పెళ్లి తన రేంజ్ కి తగ్గట్టుగా ఉండేలా ప్రతీది ముఖేష్ అంబానీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆకాష్ పెళ్లి కార్డు ఓ బాక్స్ మాదిరిగా చూడముచ్చటగా డిజైన్ చేసారు.

ఈ బాక్స్ లో రాధాకృష్ణుల ప్రతిమ, వినాయక ప్రతిమ కూడా దర్శనం ఇస్తాయి. బాక్స్ ఓపెన్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో భక్తి గీతాలు వినిపించేలా తీర్చిదిద్దారు. బాక్స్ పై పొందుపరిచిన డిజిటల్ ఆర్ట్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ బాక్స్ లో కళ్ళు చెదిరే గిఫ్ట్ లు కూడా ఉంచినట్లు చెబుతున్నారు. బంగారు వెండి వస్తువులు ఆహ్వానితులకు ఈ వెడ్డింగ్ బాక్స్ ద్వారా అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తమ కుమారుడు ఆకాష్ కి, శ్లోకా మెహతాకు పెళ్లి చేస్తున్నాం అందరూ వచ్చి ఆశీర్వదించండి అంటూ ముఖేష్ అంబానీ,నీతూ అంబానీ సంతకాలతో పెళ్లి పత్రికలో అచ్చువేశారు.