హీరోయిన్ ల వయస్సు తెలిస్తే షాకవ్వాల్సిందే …అనుపమ ఎంత చిన్నదో?
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. ఇందులో ఉత్తరాది భామలు ఎక్కువగా ఉంటున్నారు. అయితే తమిళం,మళయాళం నుంచి కూడా తెలుగులోకి వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళూ ఎక్కువే. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లతో కళకళలాడుతోంది. ఇక శతాబ్దం కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క ,కాజల్,తమన్నా,సమంత లతో పాటు కుర్ర హీరోయిన్స్ రకూల్,రాశి ఖన్నా,కీర్తి సురేష్ ఇంకా చాలా మంది తమ సినిమాలతో బిజీ అవుతున్నారు. వయస్సు లో ఉన్నప్పుడే తెలుగు లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తాయి. అయితే కొందరు వయసు ఎక్కువున్నా సరే తమ సత్తా చాటేస్తున్నారు. ఇలా కొత్తపాత హీరోయిన్స్ వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
యోగా భామ స్వీటీ అనుష్క ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసేస్తుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా కలెక్షన్ లు కురిపించగలదు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ అమ్మడు దాదాపు 15 సంవత్సరాల నుండి తెలుగులో సినిమాలు చేస్తూ టాప్ రేంజ్ కి చేరింది. ప్రస్తుతం అనుష్క వయస్సు 37 సంవత్సరాలు.
త్రిష అనగానే పరిచయమే అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఈమె వయస్సు 35 సంవత్సరాలు ఈమె దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసింది. పాపం ఈ మధ్య కాలం లో కుర్ర హీరోయిన్స్ పోటీ ఎక్కువై అవకాశాలు తగ్గాయి.
తెలుగు టాప్ హీరోయిన్ లలో కాజల్ విషయానికి వస్తే,ఈమె సినీ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయినప్పటికీ తన గ్లామర్ తో ప్రేక్షకులని అలరిస్తుంది. ఆమె ప్రస్తుత వయస్సు 33 సంవత్సరాలు. ఐటమ్ సాంగ్స్ కూడా చేసేస్తూ తన సత్తా చాటుతోంది.
ఇక సమంతను తీసుకుంటే, ఏ మాయ చేసావే సినిమాలో జెస్సి లాగా పరిచయం అయి ఆడియన్స్ కి దగ్గరైంది.గతేడాది ఆమె అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకు న్న ఈమె ప్రస్తుతం ఆమె వయస్సు 31సంవత్సరాలు. ఇటీవల వచ్చిన రంగస్థలం లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసిన ఈమె ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా, తెలుగు లో దాదాపు అందరు టాప్ హీరో లతో చేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాల తమన్నా తెలుగు , తమిళ్ , హిందీ భాషలతో సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉంది.
తక్కువ సమయంలో తెలుగులో ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న రకూల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో తెలుగు లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. గత సంవత్సరం మహేష్ బాబు తో కలిసి నటించి న ఈ భామ ఆమె వయస్సు 28సంవత్సరాలు. టాప్ హీరోయిన్ లకి గట్టి పోటీ ఇస్తూ తన సత్తా చాటుతోంది.
మహానటి సినిమాతో సావిత్రి పాత్రతో అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. తమిళ్,మలయాళం,తెలుగు సినిమాలతో బిజీ గా ఉన్న ఆమె వయస్సు 26 సంవత్సరాలు.
మలయాళం ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి చాలా పాపులారిటీ తెచ్చుకుంది.మలర్ గా తాను చేసిన పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది.గతేడాది ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఫిదా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.ప్రస్తుతం ఈమె వయస్సు 26 సంవత్సరాల సాయిపల్లవి పలు సినిమాలతో బిజీగా ఉంది.
ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా ప్రేమమ్ సినిమాతో పరిచయం అయింది.తరువాత తెలుగు లో అ ఆ,ఉన్నది ఒక్కటే జిందగి ,శతమానంభవతి వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈమె వయస్సు 22 సంవత్సరాలు. అందరికంటే ఏజ్ లో ఈమె చిన్నది కావడం విశేషం.