Business

అమెజాన్ లో చిన్న వస్తువు అయినా పెద్ద బాక్స్ లో పంపించడానికి కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎవరికీ ఖాళీ ఉండడం లేదు. దీనికి తోడు ఆన్ లైన్ లో అన్నీ అందుబాటులోకి రావడం,ఆఫర్స్ కూడా ఇవ్వడం,తగ్గింపు ధరకే రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ పై ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. దీంతో ఈ కామర్స్ సంస్థలకు గిరాకీ పెరిగింది. అందులో అమెజాన్ కీలకంగా మారింది. బయటకు వెళ్లకుండా ఫోన్ లో గానీ, కంప్యూటర్ లో గానీ,ఒక్క క్లిక్ తో మన ముంగిటకు వస్తువులు వచ్చేస్తున్నాయి.

అయితే ఎక్కడా వస్తువులు దెబ్బతినకుండా సౌకర్యవంతంగా డెలివరీ చేస్తున్నాయి. అమెజాన్ సంస్థ అయితే మనం ఆర్డర్ చేసేది చిన్నదైనా, పెద్దదైనా సరే, పెద్ద పెద్ద బాక్స్ లలో పెట్టి పంపిస్తోంది. ఆన్ లైన్ షాపింగ్ లో సెల్లర్స్ వేరే వుంటారు. ఏ వస్తువు ఏ పరిమాణంలో ఉంటుందో,ఏ బాక్స్ లో పెట్టాలో కొలతలు ఏమిటో సరిగ్గా తెలీదు. పైగా కొన్ని తప్పుగా ఎంటర్ అవుతాయి. అందుకే చిన్న వస్తువులను కూడా పెద్ద పెద్ద బాక్స్ లలో ప్యాకింగ్ చేసేసి పంపిస్తారు.

ఇక మనుషులే కాదు రోబోలు కూడా తప్పు చేయడం సహజం. అందుకే రోబోటిక్ తో పనిచేసే ఆటోమేటిక్ మెషీన్స్ కూడా తప్పులు చేయడం కొన్నిసార్లు జరుగుతుంది. అందుకే చిన్నవస్తువులను కూడా పెద్ద బాక్స్ లలో ప్యాక్ చేసాక ఓపెన్ చేయడం కుదరని పని. అందుకే పెద్ద బాక్స్ లలోనే డెలివరీ అయిపోతాయి. ఇక ఈ డెలివరీ బాక్స్ లను కూడా ఈ కామర్స్ సంస్థలు బయట సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చి తయారుచేయిస్తాయి. చిన్న బాక్స్ ల తయారీ కూడా తగ్గిపోడానికి ఇదొక కారణం.

ట్రక్కుల్లో తీసుకెళ్లేటప్పుడు ఖాళీ ఉండకూడదు. పెద్ద బాక్స్ లు అయితే సర్దడానికి కూడా వీలుగా ఉంటుంది. ఖాళీ ఉంటే ఒకదానిమీద ఒకటి పడిపోయి దెబ్బతింటాయి. అందుకే చిన్న వస్తువులను పెద్ద బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేయడానికి ఇదొక కారణం అని చెప్పాలి.