KGF మదర్ అర్చన వెనుక అసలు రహస్యం ఇదే
చిన్నప్పుడు పెద్ద పెద్ద పాత్రలు వేయడం,పెద్దవాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నట్లుగా నటించడం సినిమాల్లో మామూలే. ఇక దేశంలోనే సంచలనం సృష్టించిన కెజిఎఫ్ మూవీలో యువ హీరో యష్ తల్లిగా నటించిన కన్నడ నటి అర్చన జోయిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. నాన్షి అనే నిక్ నేమ్ గల అర్చన పుట్టిన ప్రదేశం కోలార్ నేపథ్యంలోనే కెజిఎఫ్ మూవీ తెరకెక్కడం విశేషం. శ్రేయాస్ ఉడుతా అనే యువకుడిని పెళ్లాడింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టె పోస్ట్స్ అర్ధవంతంగా ఉండడమే కాదు,చాలా డీసెంట్ గా కనిపిస్తాయి. మిగిలిన నటుల కంటే భిన్నంగా ఉండే అర్చన అతి తక్కువ వయస్సులోనే పెద్ద పాత్రను పోషించి అందరినీ మెప్పించింది.
కెజిఎఫ్ మూవీ కన్నడలోనే కాదు,తెలుగులో కూడా హిట్ అయింది. హిందీలో కూడా విజయాన్ని నమోదుచేసుకున్న తొలి కన్నడ చిత్రంగా నిల్చింది. కన్నడ , తెలుగు,తమిళం, హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదుచేసుకున్న కెజిఎఫ్ సినిమాలో రాక్ కంటెంట్ కి జనం బాగానే కనెక్ట్ అయ్యారు. మాస్ ని దృష్టిలో ఉంచుకుని తీయడంతో అన్ని సెంటర్స్ లో కూడా ఈ మూవీ ఓ ఊపు ఊపేసింది.
ఇప్పటివరకూ కన్నడ చిత్రం వసూలు చేయని విధంగా కెజిఎఫ్ వందల కోట్ల భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ తో యష్ జనం నుంచి నీరాజనం అందుకుంటే ,గుండెలు పిండేసే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉండడం విశేషం. హీరో యష్ తల్లిగా అర్చన జోయిస్ తన నటనతో ఆడియన్స్ ని కంటతడి పెట్టించింది. కేవలం పాతికేళ్ల వయస్సులోనే వయస్సు మళ్ళిన, బరువైన పాత్రను పోషించి ఆకట్టుకున్న అర్చన క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
సినీ అనుభవం కూడా లేకుండా తొలి సినిమాతోనే అదరగొట్టేసింది. ఇక అర్చన జోయిస్ గురించి వివరాల్లోకి వెళ్తే మహాదేవి,దుర్గ,నీలి అనే టివి సీరియల్స్ లో చేసింది. అయితే ఇలా ఓ సీరియల్ నటిని తల్లి పాత్రకు తీసుకోవడం వలన కెజిఎఫ్ డైరెక్టర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అర్చన నటన చూసి అందరూ షాక్ అయ్యారు. మళయాళీ అమ్మాయి అయిన ఈమె ఫ్యామిలీ కర్ణాటకలో సెటిల్ అయింది. కోలార్ లో 1994 డిసెంబర్ 24న జన్మించిన ఈమె పేరెంట్స్ ఇద్దరూ ఎంప్లాయిస్ కావడంతో బాగా చదివించారు.
బెంగుళూరులోనే స్టడీస్ చేసిన ఈమె హైస్కూల్ దశనుంచే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా అర్చన ఉండేది. అందుకే కాలేజ్ డేస్ కి వచ్చేసరికి మోడల్ గా ఎన్నో ఛాన్స్ లు అందుకుంది. వాటిలో కొన్నింటిని ఎంచుకుని ముందుకు సాగిన అనురాధా విక్రాంత్ దగ్గర కథక్ నేర్చుకున్న ఈమె భరతనాట్యం లో కూడా ప్రావీణ్యం పొందింది.
ఇక కరాటే కూడా కష్టపడి నేర్చేసుకుంది. అనేక టోర్నమెంట్స్ లో విజయాలు నమోదు చేసుకుంది. జిమ్నాస్టిక్స్,యోగాలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. దృష్టి ఆర్ట్ సెంటర్,నాట్య డాన్స్ గ్రూప్ లతో కల్సి దాదాపు 300కి పైగా ప్రదర్శనలిచ్చిన ఈమె ప్రస్తుతం కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారం అవుతున్న తకధిమిత అనే కన్నడ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటోంది.