Movies

బిత్తిరి సత్తి గురించి షాకింగ్ విషయాలు … నెల సంపాదన ఎంతో తెలుసా?

తెలంగాణా పదాలతో వినూత్నంగా వార్తలు చదువుతూ న్యూస్ రీడర్ అంటే ఇలా కూడా ఉండొచ్చని నిరూపిస్తూ బిత్తిరి సత్తి ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాడు. బుల్లితెర రంగంలో న్యూస్ రీడర్ గా సరికొత్త ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. తెలుగు కమెడియన్స్ లో బ్రహ్మానందం ను చూస్తే కొందరికి నవ్వొస్తుంది. అలాగే పువ్వుల చొక్కా,నిక్కరు తో బిత్తిరి సత్తిని చూస్తే మరికొందరికి నవ్వొస్తుంది. రాత్రి 9న్నర అయితే చాలు కేసీఆర్ మీద మాట్లాడినా, చంద్ర సార్ , జగనన్న సార్ అన్నా సరే ఆవార్తలను పగలబడి నవ్వుతూ చూసేస్తాం. చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ బిత్తిరి సత్తి వార్తలను ఎంజాయ్ చేసేవారు. అన్నీ బానే ఉన్నాయి కానీ అతడి నవ్వుల వెనుక ఎన్నేళ్ల కష్టం , శ్రమ ఉన్నాయో తెలిస్తే షాకవుతాం.

కావలి రవికుమార్ అనే బిత్తిరి సత్తి ని అందరూ చేవెళ్ల రవి అని కూడా పిలుస్తారు. కావలి నరసింహ, యాదమ్మ దంపతులకు 1979ఏప్రియల్ 5న చేవెళ్ల మండలం పామేలలో జన్మించిన ఇతడికి ఓ అక్క ఉంది. అతడి తండ్రి యాదయ్య గ్రామంలో కావలిగా ఉంటూ అప్పుడప్పుడు యక్షగానాలు చేసేవాడు. తండ్రి కళాకారుడు కావడంతో సినిమాల్లో నటించాలని సత్తికి చిన్ననాటినుంచి ఆశ ఉండేది. 5వ తరగతి వరకూ సొంత ఊరిలో చదివిన సత్తి,ఇంటర్ వరకూ చేవెళ్లలో చదివాడు. ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్ళినపుడు గానీ, తరగతిలో గానీ అందరిని నవ్విస్తూ సరదాగా ఉండే సత్తి,రంగస్థలంలో శిక్షణ తీసుకుని చాలా నాటకాల్లో నటించాడు.

సినిమా ఛాన్స్ లకోసం హైదరాబాద్ వచ్చి కృష్ణ నగర్ లో ఉండే సత్తి, జబర్దస్త్ ఫెమ్ కొమరం తో కల్సి రూమ్ లో ఉంటూ, సినీ డైరెక్టర్స్ ని కల్సి ఛాన్స్ లు అడిగేవాడట. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర మేనేజర్ గా పనిచేసాడు. సినిమా ఛాన్స్ లకోసం ప్రయత్నిస్తే, నీ ముఖానికి సినిమాలు తక్కువా అంటూ కొందరు హేళన చేసేవారట. నీ మాటలు సినిమాలకు పనికిరావని కొందరు,నల్లగా ఉన్నావని కొందరు అవమానించేవారట. విలన్ లా వున్నావ్ ,ఏమైనా చిన్న క్యారెక్టర్ ఉంటె పిలుస్తాము అనేవారట. వాళ్ళు వీళ్ళు అనేమాటలకు బాధ కలిగినా ఓర్చుకునేవాడు. ఇక ఒకరి సలహా మేరకు డబ్బింగ్ ఆర్టిస్టుగా 2005లో మెంబర్ షిప్ తీసుకున్నాడు. 15ఏళ్లుగా 150సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు.

అయితే సినీ ఛాన్స్ లు మాత్రం రాకపోవడంతో వ్యవసాయం చేసుకుందామని ఇంటికి వెళ్ళిపోయి, అరటి తోట వేసి డబ్బులు సంపాదిస్తూనే అప్పుడప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ల మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేవాడు. ఆసమయంలోనే వి6 ఛానల్ లో మనవూరి తాతయ్య ప్రోగ్రాం చేసాడు. ఆతర్వాత జి తెలుగులో ప్రసారం అయిన కామెడీ షో చేసాడు. జర్నలిజంలో కోచింగ్ తీసుకుని, వివిధ చానల్స్ లో పనిచేసి ,2015లో వి6 ఛానల్ లో తీన్ మార్ కార్యక్రమంలో విజయాన్ని అందుకున్నాడు. అమాయకంగా, కల్మషం లేని ముగ్గురు వ్యక్తుల ఇన్స్పిరేషన్ తో డ్రెస్ కోడ్ డిజైన్ చేసుకుని, చేసిన తీన్ మార్ వార్తలతో టిఆర్పి రేటింగ్ కూడా అమాంతం పెరిగింది. సావిత్రి తమ్ముడుగా జనాలు మాట్లాడే భాషలో నవ్వు రప్పించేలా మాట్లాడ్డం ఆకట్టుకునేది.

ఇక సీమ శాస్త్రి చిత్రంలో చిన్న పాత్ర వేసి, టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బిత్తరి సత్తి రుద్రమదేవి సినిమాలో సామంత రాజు పాత్రను అల్లు అర్జున్ ఇప్పించడంతో అందులో నటించాడు. పేపర్ బాయ్,గౌతమ్ నందన్,నేనే రాజు నేనే మంత్రి వంటి మూవీస్ లో నటించాడు. ఇక హైదరాబాద్ ఫిలిం సిటీలో ఉన్న కాస్ట్లీ ఇల్లు చూస్తే షాకవుతాం. నెలకు అక్షరాలా లక్షలు సంపాదించే సత్తికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. అయితే సినిమాల్లో బిజీ అయిపోయిన సత్తి, వి6ఛానల్ వదలనని, ఇందులో చేస్తూనే నటిస్తానని చెబుతున్నాడు.