కోట శ్రీనివాసరావు పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్ముడు శంకరరావు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్న గెటప్ లతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ డమ్ తెచ్చుకున్న నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ప్రతిఘటనలో తెలంగాణ యాసలో విలనిజం పండించినా,అహనా పెళ్లంట మూవీలో పిసినారి పాత్రలో నవ్వించినా, హాస్యం పాత్రల్లో ,విలన్ పాత్రల్లో మెప్పించిన అది కోట శ్రీనివాసరావుకే చెల్లిందని చెప్పాలి. దక్షిణాదిలోనే ఆయన పేరంటూ తెలియని వారు ఉండరు. నటుడిగా కోట దాదాపు 750 సినిమాలతో నటించి తారాస్థాయికి చేరారు. కోట కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్ క్రియేట్ చేసేదాకా దర్శకులు వెళ్లారంటే ఆయన నటనను ఆడియన్స్ ఎంతగా ఇష్టపడేవారో చెప్పవచ్చు. ఎంత క్లిష్టమైన కేరక్టర్ అయినా కోట చేయగలడన్న ధీమా చిత్రబృందానికి ఉండేది.
ఇక కోటకు షూటింగ్ బిజీలో పెళ్ళాం పిల్లలతో అసలు గడపడానికే ఖాళీ ఉండేదికాదు. ఇక బీజేపీలో చేరి విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా కూడా గతంలో ఎన్నికయ్యారు. అందరితో విస్తృత పరిచయాలున్నా సరే ఆయన తమ్ముడు కోట శంకరరావు ని ఎవరికీ పరిచయం చేయలేదు. క్యారెక్టర్స్ పరంగా ఎంకరేజ్ చేయలేదు. ఈవిషయం స్వయంగా శంకరరావు చెబుతూ అన్నమీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.
సొంతంగా సినిమాలు తీయడం గానీ, సమర్పించడం గానీ లేనేలేదు. పోనీ ఏవీఎస్ మాదిరిగా డైరెక్టర్ అవతారం ఎత్తి, ఏదో పోగొట్టుకున్న పరిస్థితీ లేదు. చివరకు తమ్ముడికోసం ఓ సినిమా చేసి నిలబెట్టేలా ఒక చిన్న ప్రయత్నం కూడా చేయనేలేదు. ఏ రకంగానూ తమ్ముడికి ఎలాంటి సపోర్ట్ చేయలేదని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో గల పరిచయాలతో తమకు వేషాలు ఇప్పించలేదని శంకరరావు విస్తుపోయారు. తనవరకూ తాను చూసుకుని చేతులు దులిపేసుకువడం మినహా కోట శ్రీనివాసరావు చేసిందేమీలేదని శంకరరావు అంటుంటారు. నిజానికి ఇండస్ట్రీలో చాలామంది తమవాళ్లకు వీలున్నప్పుడు ఛాన్స్ లు ఇప్పించుకుంటూ సెటిల్ అవ్వడానికి కృషిచేసిన వాళ్ళు,నిలదొక్కుకున్నవాళ్ళు చాలామంది ఉన్నా, మా వరకూ వచ్చేసరికి బ్రదర్ ఎంకరేజ్ మెంట్ లేకుండా పోయిందని శంకరరావు వాపోతున్నారు.
తమ్ముడికి ఛాన్స్ ఇస్తేనే తాను వేషం కడతానని డిమాండ్ చేసి ఉంటే,ఒకటి రెండు సినిమాల తర్వాత తనను కూడా పక్కన పెట్టేస్తారన్న భయం అన్నయ్యను వెంటాడేదని శంకరరావు అంటున్నారు. తెరమీద , తెరవెనుక కూడా నటన గురించి సూచనలు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవని అంటున్నాడు. ఇలాంటి అన్నయ్య ఉన్నాడని చెప్పుకోడానికే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అనేశాడు.