స్టార్ హీరో భార్య వాడుతున్న ఫోన్ ధర ఎంతో తెలుసా?
ఒకప్పుడు ఫోన్ అంటే అది డబ్బున్న వాళ్ళకే పరిమితం. గ్రామాల్లో అయితే ఒక్కరికో ఇద్దరికో ఉండేవి. సాంకేతిక విప్లవం పుణ్యామా అని ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ కనిపిస్తోంది. మామూలు ఫోన్ కూడా కాదు. అన్ని ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఫోన్ లేకుంటే రోజు గడవదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్‌లు వాడటం వలన ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయ్యింది. టెక్నాలజీ పెరగడం మంచిదే కాని, దాన్ని కొందరు విపరీతమైన పనులకు వాడుతున్నారు. కొందరైతే స్మార్ట్ ఫోన్స్‌కు బానిసగా మారిపోతున్నారు. ఇక ఎంతో మంది పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్‌లకు బానిసగా మారుతున్నారు. ఇది మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే,కొంతమంది ఇప్పటికీ బేసిక్ ఫోన్స్ వాడుతున్నారు. మరి స్టార్ హీరో భార్య కూడా అదే బాటలో నడుస్తోంది. పిల్లలు కారణంగానో లేదా మరో కారణమో తెలీదు గానీ తమిళ స్టార్ హీరో అజిత్ భార్య నోకియా బేసిక్ పీచర్ ఫోన్ వాడుతున్నారు. నిజం, ఎందుకంటే అజిత్ భార్య షాలిని తాజాగా ఒక కార్యక్రమంలో పిల్లలతో పాటు పాల్గొన్నారు. అప్పుడు ఆమె చేతిలో నోకియా బేసిక్ మోడల్ ఫోన్ కనిపించి అందరు కూడా అవాక్కయ్యారు.
ఎందుకంటే, అజిత్ ఒక్కో సినిమాకు 10 కోట్లకు మించి పారితోషికం తీసుకుంటారన్న ప్రచారం ఉంది. అలాంటి అజిత్ భార్య కోరుకుంటే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ వాడగలదు. కాని ఆమెకు ఆసక్తి లేకపోవడం వల్లో లేక మరేంటో కాని కేవలం మూడు వేల రూపాయల ఫోన్‌ను వాడుతోంది.
మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో అవసరం లేదు.
అవసరం ఉన్నా లేకున్నా ఫోన్‌ను వాడటం ఎందుకు, షాలినిని చూసి అంతా నేర్చుకోవాలి, నిజంగా అజిత్ ,షాలిని లను అభినందించాలి. నిజానికి ఆమెను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు మాత్రం దాంట్లో కొత్తేం ఉంది, షాలిని ఎప్పుడు కూడా ఆ ఫోన్‌ను వాడుతుంది కదా అంటారు. అయితే ఇన్ని రోజుల సంగతి ఏమో కాని తాజాగా షాలిని చేతిలో చిన్న మొబైల్ ఫోన్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. మనసారా అభినందిస్తున్నారు.