Politics

కేసీఆర్ కూతురు కవిత గురించి అసలు నిజాలు ఇవే…. నమ్మలేని నిజాలు

తెలంగాణా కోసం కేసీఆర్ ఉద్యమిస్తున్నప్పటి నుంచి ప్రజా ప్రతినిధిగా లోకసభలో కీలక పాత్ర పోషించే స్థాయివరకూ చూస్తే కేసీఆర్ కూతురు కవిత లో డేరింగ్ అండ్ డాషింగ్ లక్షణాలు ఎక్కువని తెలుస్తుంది. భాష మీద పట్టు,ప్రత్యర్థులపై విరుచుకు పడడం, విపక్షాల విమర్శలకు తగిన బదులివ్వడం ఇలా అన్ని విషయాల్లో కవిత స్టైల్ వేరు. తెలంగాణా కట్టు,బొట్టూ తో అచ్చమైన యాసతో దూసుకెళ్తున్న కవిత తెలంగాణా బతుకమ్మ ఉత్సవాలను వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత సాధించారు. పార్లమెంట్ లో తోలి తెలంగాణ ఆడపడుచుగా గళం విప్పిన కవిత తన వాక్పటిమతో ప్రత్యర్థులను గుక్కతిప్పుకోకుండా చేయడంలో తనకు తానె సాటి. ఎంపీగా ఉన్నా సరే, ఓ సాధారణ మహిళగా జనంలో దూసుకెళ్లడం ఆమె నైజం.

కరీం నగర్ జిల్లా చింతమడక గ్రామంలో 1978మార్చి 13న కేసీఆర్ , శోభా దంపతులకు జన్మించిన కవిత ను చూసి రెండవ సంతానంగా మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరపడ్డారట. మూడవ తరగతి వరకూ అమ్మమ్మ ఊళ్ళో చదివిన ఈమె హైదరాబాద్ లో తదుపరి ఎడ్యుకేషన్ పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి చదువులో నెంబర్ వన్ గా నిల్చింది. విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ సాధించిన ఈమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసింది. 2003లో మెకానికల్ ఇంజనీర్ అనిల్ తో పెళ్లయ్యాక అమెరికా వెళ్ళిపోయింది.

వీరికి ఆదిత్య,ఆర్య అనే ఇద్దరు పిల్లలున్నారు. కవిత అన్నయ్య కేటీఆర్ టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ, టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో 2004లో అమెరికా నుంచి వచ్చేసిన కవిత ఉద్యమంలో భాగమయ్యారు.
నల్గొండ జిల్లాలో కొన్ని ఊళ్లు దత్తత తీసుకుని పేదల చదువుకి దోహదపడిన కవిత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను అవహేళన చేయడాన్ని నిరసించింది.

ఇక తెలంగాణను వ్యతిరేకిస్తూ డైలాగ్స్ ఉన్నాయన్న కారణంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ అదుర్స్ ని అడ్డుకుని సెన్షేషన్ క్రియేట్ చేసింది. 2010లో కోటి బతుకమ్మ పండుగ లక్షలమందితో నిర్వహించారు. 2014వరకూ తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి,తెలంగాణా రాష్ట్ర సాధనలో కృషి కీలకంగా నిల్చింది. 2014లో నిజామాబాద్ నుంచి లక్షా 70వేల ఓట్ల మెజార్టీతో లోకసభకు ఎన్నికయ్యారు. జగిత్యాల లో కాంగ్రెస్ ని ఓడించి టిఆర్ ఎస్ ని గెలుపు బాట పట్టించారు.

తెలంగాణా అమరవీరుల కుటుంబాలకు 10లక్షల చొప్పున సాయం అందించి కంటనీరు తుడిచారు. ఎంపీగా పలు అభివృద్ధి పనులు పూర్తిచేశారు. నిజామాబాద్,పెద్దపల్లి రైల్వే లైన్లు, పూర్తిచేయించడం, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ఇలా పనులు సాధించారు. బతుకమ్మ పండుగను దేశవిదేశాల్లో నిర్వహిస్తూ తెలంగాణా సంస్కృతి చాటుతున్నారు. ఇలా తన చేతలతో ఉత్తమ ఎంపీగా కేంద్రం నుంచి గుర్తింపు తెచ్చుకున్న కవిత ఆదర్శం అవుతున్నారు.