జయసుధ తల్లి కూడా ఒక్కప్పటి నటి…. ఆమె ఎవరో తెలుసా?
కొందరు టాప్ హీరోయిన్స్ తమ పేరెంట్స్ గురించి చెప్పుకోడానికి ఇబ్బంది పడతారు. కారణం వాళ్ళ వృత్తి గురించి కాదు,వాళ్ళు సినిమాల్లో పోషించిన పాత్రలను బట్టి అలా చెప్పలేరు. అందులో సహజనటి జయసుధ ఒకరని అంటున్నారు. ఆమె తల్లి ఒక గ్రూప్ డాన్సర్ లలో ఒకరుగా నటించారని చెప్పడానికి ఇబ్బంది పడతారట. జయసుధ అసలు పేరు సుజాత. ఈమె తల్లి నిడదవోలు జోగాబాయి ది విజయనగరం. జయసుధ తాతయ్య నిడదవోలు వెంకట్రావు పెద్ద రచయిత. తాతముత్తాల కాలంలోనే చెన్నైకి వలస వచ్చేసారు. అయితే చెన్నైలో ఉన్నప్పటికీ తెలుగింటి అమ్మాయిగానే పెరిగింది. విజయనిర్మల తండ్రి ,జయసుధ తండ్రి అన్నదమ్ములు.
1950లలో సినీ ఇండస్ట్రీ బాగా ఊపందుకుంటున్న సమయంలో కొందరు ఈ రంగంలోకి వచ్చి స్థిరపడ్డారు. అందులో విజయలలిత, విజయనిర్మల వంటి వాళ్ళు క్లిక్ అయ్యారు. అయితే జయసుధ తల్లి జోగాబాయి,శ్రీదేవి తల్లి రాజేశ్వరి వంటివాళ్లకు అదృష్టం కల్సి రాకపోవడం వలన సైడ్ అయిపోయారు. అయితే తమ పిల్లలచేత తమ సినీ రంగ కోర్కెను తీర్చుకున్నారు.
అందుకే జయసుధ,శ్రీదేవి స్టార్ హీరోయిన్స్ అయ్యారు. తమిళ మూవీతో జయసుధ ఎంట్రీ ఇచ్చి, జ్యోతి మూవీతో తెలుగు వెండితెరకు వచ్చి తారాపధంలోకి దూసుకెళ్లింది. రొమాంటిక్ పాత్రలంటే శ్రీదేవి,అందాల పాత్రలంటే జయప్రద,సీరియస్ పాత్రలంటే జయసుధ అనే విధంగా రాణించారు.
ఇక జయసుధకు ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ బంధువులతో జరిగిన పెళ్లి ఆతర్వాత చెడిపోయింది. ఆతర్వాత జితేంద్ర బావమరిది నితిన్ కపూర్ తో పెళ్లయింది.
ఇద్దరు పిల్లలు జన్మించారు. తన కొడుకులలో ఒకరు రచనలు చేస్తుంటారని,మరొకరు కోచ్ గా ఉంటారని జయసుధ అంటారు. అయితే తల్లి వలన సినిమా పరిశ్రమకు వచ్చానని చెప్పకుండా, విజయనిర్మల వలన వచ్చానని చెబుతుంది. తండ్రికి సినిమా వాళ్లంటే పిచ్చికోపం,పైగా తల్లి డాన్సర్ గా చేసిందని చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది.
1954లో కె రాఘవేంద్రరావు తండ్రి కె ఎస్ ప్రకాశరావు డైరెక్షన్ లో వచ్చిన బాలానందం మూవీలో ముఖ్య పాత్ర పోషించిన జోగాబాయి, ఆతర్వాత అక్కినేని నటించిన కాళహస్తి మహత్యంలో నటించింది. అలాగే ఎన్టీఆర్ వంటి ప్రముఖుల సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా నటించింది. ఇక జయసుధ తండ్రి ఒకసారి ఎయిర్ పోర్టులో రజనీకాంత్ తో గొడవపడ్డాడు. అంతేకాదు, తన రెండో కూతురు సుభాషిణిని కూడా హీరోయిన్ కాకుండా ఆయన అడ్డుకున్నారు.