Politics

MLA గా ఆలీ గెలుపు ఖాయమా? రంగం సిద్ధం అయిందా?

అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ప్రముఖ హాస్య నటుడు ఆలీ గుంటూరు నుండి అసెంబ్లీ కి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగుదేశం పార్టీ తో ఆలీ కి దాదాపు ముప్పయ్యేళ్ల అనుబంధం ఉండడం, పైగా చంద్రబాబుతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండడం నేపథ్యంలో ఈసారి తప్పకుండా అసెంబ్లీ కి పోటీ చేయాలనీ శాసనసభలో అడుగు పెట్టాలని అలీ భావిస్తున్నాడు. రకరకాల పార్టీలలో ఆలీ చేరతాడని ఊహాగానాలు వచ్చాయి.

కానీ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడానికి దాదాపు సిద్దమయ్యాడు. తాజాగా గుంటూరు వెళ్లిన ఆలీ హైదరాబాద్ లో ఉన్న తన ఓటు ని రద్దు చేసి గుంటూరు లో ఓటు హక్కు కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘంని కోరడం వెనుక పోటీ ఖాయమని తేలిపోయింది. అయితే ఆలీ గెలుస్తాడా ? అసెంబ్లీ లో అడుగు పెడతాడా ? తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి కూడా కొట్టేస్తాడా ? అంటే బోలెడు అనుమానాలు వస్తున్నాయి.

ఎందుకంటే ముందుగా తెలుగుదేశం పార్టీ టికెట్ రావాలి , ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఓటెయ్యాలి అది అయ్యాక చంద్రబాబు అధికారంలోకి మళ్ళీ రావాలి అప్పుడు మంత్రి పదవి ఇలా బోలెడు చిక్కులు ఉన్నాయి కదా. అంటే ఆలీ ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫర్మ్ అయ్యింది . ఇక ఎం ఎల్ ఏ గా గెలుస్తాడా ? మంత్రి పదవి చేపడతాడా అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలు అభ్యర్థులను సెలక్ట్ చేస్తున్నాయి. అలీ కి టీడీపీ టికెట్ దక్కితే, వైకాపా కూడా అందుకు తగ్గ కేండిడేట్ ని పెడ్తుందని, జనసేన నుంచి ఎవరు పోటీపడతారని చర్చించుకుంటున్నారు.