Movies

ఇలియానా గురించి నమ్మలేని నిజాలు… ఈ భామ ఇప్పుడు ఏమి చేస్తుంది

ఇండస్ట్రీలోకి వచ్చి 13ఏళ్లయినా వన్నె తరగని అందంతో ఇలియానా ఆడియన్స్ ని మత్తెక్కిస్తోంది. దేవదాసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ,తన అందచందాలతో ఆడియన్స్ కి దగ్గరైంది. ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. పోకిరి సినిమాలో నాజూకైన నడుముతో కుర్రకారుని బుట్టలో వేసుకుంది. పలు చిత్రాల్లో ఆమె నటనకు యువత ఫిదా అయ్యారు. జులాయి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి దూరంగా జరిగినప్పటికీ అమర్ అక్బర్ ఆంటోని మూవీతో బొద్దుగా మారి రీ ఎంట్రీ ఇచ్చింది. 1987నవంబర్ 1న ముంబయ్ లోని మహిమా నగరంలో గ్రీకు వర్గానికి చెందిన రోనాల్డ్ , సమీరా డిక్రజ్ దంపతులకు పుట్టిన ఇలియానా పూర్తిపేరు ఇలియానా డిక్రజ్. ఈమెకు ఫర్హంట్, ఇలియాన్ట్ ఇక్రోజ్ అనే ఇద్దరు చెల్లెల్లు, రైస్ అనే అన్నయ్య ఉన్నారు.

ఇలియానా చిన్నప్పుడే వారి కుటుంబం గోవాలో సెటిల్ అయింది. రోమన్ కేథలిక్ లు గోవా పశ్చిమ ప్రాంతంలో ఇంగ్లీషు,కొంకణ్ భాషలు మాట్లాడతారు. ఇలియానా మథర్ ముస్లిం కాగా ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో రెండు మతాల పూజలు జరిగేవి. తనకు ఇష్టం లేకున్నా స్టడీస్ సమయంలో తల్లి కోరికమేరకు మోడలింగ్ లోకి ఎంటరై,లక్స్,ఫెయిర్ అండ్ లవ్లీ వంటి ప్రకటనల్లో చేసింది. ఇక సినిమాల్లో యాక్ట్ చేయాలనే కోరిక పుట్టింది. అరుణ భిక్షు నటన స్కూల్లో చేరి,సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

2006లో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన దేవదాసు మూవీతో రామ్ తో కల్సి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హీరోహీరోయిన్స్ కి తొలిసినిమా అయినప్పటికీ మంచి పేరొచ్చింది. ఇద్దరికీ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇక ఆతర్వాత మహేష్ బాబు సరసన పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పోకిరి మూవీలో నటించి, తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అదేసమయంలో కేడి మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. రవికృష్ణతో నటించిన ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా ఛాన్స్ లు తగ్గలేదు.

ఆతరవాత ఖతర్నాక్ లో రవితేజ సరసన నటించిన ఇలియానా ఆతర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాఖి మూవీలో నటించి అదరగొట్టేసింది. ప్రభాస్ సరసన మున్నా లో నటించి పేరుతెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ తో జల్సా మూవీలో నటించి ఫిలిం ఫేర్ ఉత్తమ నటి గా అవార్డు అందుకుంది. మంచు విష్ణుతో సలీం,నితిన్ తో రెచ్చిపో మూవీస్ ప్లాప్ అయ్యాయి. 2011లో ఎన్టీఆర్ సరసన శక్తి మూవీలో,రానా సరసన నేను నా రాక్షసి మూవీస్ లో చేసింది. 2012లో తమిళ నటుడు విజయ్ తో కల్సి నటించింది.

ఇది భారీ విజయం నమోదు చేసుకుంది. ఆతరువాత అల్లు అర్జున్ తో కల్సి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జులాయి లో నటించి,విజయం అందుకున్నప్పటికీ అదే ఏడాది రవితేజా సరసన చేసిన దేవుళ్ళు చేసిన మనుషులు మూవీ ప్లాప్ అయింది. అప్పుడే బర్ఫీ చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. రణధీర్ కపూర్ తో కల్సి చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఫిలిం ఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డు గెల్చుకుంది. రెడ్ అండ్ వైట్ కలర్స్ అంటే ఇష్టపడే ఈమె బిర్యానీ,చైనీస్ ఫుడ్ ఎక్కువగా లాగిస్తుందట.

హృత్రిక్ రోషన్ అంటే ఇష్టమని,స్విమ్మింగ్ సూట్, ఫోటో షూట్ అంటే ఇష్టం అని చెబుతోంది. ఈమె పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆంటోని ఫోర్డ్ తో పెళ్లయినట్లు ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్లి మార్పు అయినా ,తన జీవితంలో పెద్దగా మార్పు లేదని చెప్పింది.