Movies

ప్రియదర్శి గురించి నమ్మలేని నిజాలు…బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

నా చావు నేను చస్తా నీకెందుకురా భయం అనే డైలాగ్ పెళ్లిచూపులు సినిమాలో బాగా క్లిక్ అయింది. ఆ డైలాగ్ కొట్టిన యాక్టర్ అనగానే మనందరికీ ఠక్కున గుర్తొచ్చే వ్యక్తి ప్రియదర్శి. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం ఈ డైలాగ్ తోనే గుర్తింపు పొందిన ప్రియదర్శి తనను తాను నమ్ముకుని కృషి పట్టుదల తో ఏదైనా సాధించగలమన్న నమ్మకం ఉన్నవాడు. తండ్రి ఖమ్మం జిల్లా అయితే తల్లిది గుంటూరు జిల్లా. తండ్రి కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాగా, తల్లి గృహిణి. వీరికి 1989 ఆగస్టు 25న తొలి సంతానంగా పుట్టిన ప్రియదర్శి కి ఉన్న ఓ చెల్లి నేవీలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ రీత్యా తండ్రి మొదట్లో హైదరాబాద్ లో నే ఉండగా, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు. ప్రియదర్శి స్టాటిస్టిక్స్ లో డిగ్రీ చేసారు. యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి జర్నలిజంలో పిజి పట్టా అందుకున్నాడు. పిక్స్ అనే కంపెనీలో అసోసియేట్ ప్రొడ్యూసర్ గా చేస్తూ కథలు రాస్తూ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కోరికను పేరెంట్స్ కి చెప్పడంతో మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత తండ్రి ఒప్పుకుని,ఆయనకు తెల్సిన డైరెక్టర్ భిక్షుతో విషయం చెప్పారట. తాను తీసిన షార్ట్ ఫిలిమ్స్ పట్టుకుని భిక్షు దగ్గరకు వెళ్లిన ప్రియదర్శికి చుక్కెదురైంది. సినిమాల్లోకి వద్దు, బుద్ధిగా ఉద్యోగం చేసుకో అన్నారట. అయినా సరే సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో కథలు రాస్తూ,బాబాయ్ ప్రోత్సహంతో సినిమాల్లో ట్రై చేసాడు.

సన్నగా, ముఖంపై మొటిమలతో గల ప్రియదర్శిని చూసి అందవికారంగా ఉన్నావ్ నువ్వు పనికిరావు సినిమాలకు అనేవారట. ఇటు సినీ ఛాన్స్ లు రాకపోవడం,పేరెంట్స్ ఉద్యోగం చేసుకోమని వత్తిడి తేవడం వంటి పరిణామాల్లో ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చాడట. హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే, ప్రియదర్శి అక్కడకు వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొనేవాడట.

సాగర సంగమం సినిమా స్ఫూర్తి,చిరంజీవి ,రవితేజ ప్రేరణతో తనకు ఏదో ఒకరోజు ఛాన్స్ రాకుండా ఉంటుందా అని ఎదురుచూసేవాడట. ఓటమి అనేది గెలుపునకు నాందిగా భావించి ఒక్కో ఆడిషన్స్ లో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్తుంటే,శ్రీకాంత్ హీరోగా 2016లో చేస్తున్న టెర్రర్ అనే మూవీలో కేరక్టర్ ఆర్టిస్ట్ ఛాన్స్ వచ్చింది. అది పెద్దగా జనంలోకి వెళ్ళలేదు.

అయితే అదే ఏడాది దశ తిరిగింది. విజయ్ దేవరకొండ హీరోగా, తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా రాజ్ కందుకూరి తీసిన పెళ్లిచూపులు సినిమాలో ఛాన్స్ వచ్చింది. కౌశిక్ పాత్రతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆతర్వాత గాజి, అర్జున్ రెడ్డి,కేశవ, బాబు బాగా బిజీ,జై లవకుశ,స్పైడర్,రంగుల రాట్నం వంటి మూవీస్ లో ఛాన్స్ లు వచ్చేసాయి. ఇటీవల మేరేజ్ కూడా అయిన ప్రియదర్శి కి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాతో క్రేజ్ మరింత పెరిగింది. తొలిప్రేమ,నోటా, పడిపడి లేచే మనసు,ఎఫ్ 2,మిస్టర్ మజ్ను,సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.