కమెడియన్ విజయ్ సాయి భార్య వనిత ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
బయట సమాజంలో మాదిరిగా తెలుగు ఇండస్ట్రీలో ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. సమస్యలతో సతమయ్యేవాళ్ళు వాటిని తట్టుకోలేక ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక తెలుగులో విజయ్ సాయి అనే కమెడియన్ ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు. సున్నితమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇతడి ఆత్మహత్య సెన్షేషన్ క్రియేట్ చేసింది. భార్య విడిపోవడం,ఆమె దగ్గరే తన కూతురు పెరగడం, ఒంటరితనం భరించలేకపోవడం, అవమానాలు భరించలేకపోవడం ఇవన్నీ తట్టుకోలేక ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు.
అతడి చావుకి భార్య అనితారెడ్డి కారణమనే ఆరోపణలు వచ్చాయి. అయితే కొన్నాళ్ళు పోలీసులకు దొరక్కుండా తిరిగిన వనితారెడ్డి ఆతర్వాత లొంగిపోయి ప్రస్తుతం ఇంకా కోర్టు కేసులో తిరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన వనితారెడ్డి అసలు పేరు వరలక్ష్మి. ఈమె సినిమాల్లో రాణించాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చి, ఎన్నో సినిమాల్లో వాంప్ రోల్స్,ఐటెం గర్ల్ గా నటించింది.
వంశి డైరెక్షన్ లోని అనుమానాస్పదం మూవీలో ఒక పాత్ర వేసింది. వనితారెడ్డికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లయినప్పటికీ ఆతర్వాత విడిపోయారు. సినిమాల్లో నటిస్తుండగా, వాల్ పోస్టర్ సినిమాతో విజయ్ తో సాన్నిహిత్యం ఏర్పడి, లవ్ నుంచి పెళ్ళికి దారితీసింది. వీళ్లకు ఓ పాప ఉంది. పున్నాగ అనే సీరియల్ లో నటించింది.
మొదట్లో వీళ్ళ దాంపత్యం సాఫీగా సాగినప్పటికీ ఆతర్వాత గొడవలతో విడిపోయారు. శశిధర్ అనే ఇండస్ట్రియలిస్ట్ కారణంగా వనితకు, తనకు మనస్పర్థలు వచ్చాయని సూసైడ్ సెల్ఫీలో విజయ్ పేర్కొన్నాడు. ఇక ఈ కేసులో పోలీస్ స్టేషన్,కోర్టుల చుట్టూ తిరిగిన వనితా రెడ్డి కి సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వడం మానెయ్యడంతో టివి సీరియల్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం అవి కూడా తగ్గడంతో కొత్త ఛాన్స్ లకోసం ఎదురుచూస్తోంది.