MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ , స్నేహారెడ్డి ప్రేమ నుండి పెళ్ళిపీటలు ఎక్కటానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా?

Tollywood Hero Allu Arjun:గంగోత్రి మూవీతో తెలుగు చిత్రసీమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ వరుస విజయాలతో సినిమాల్లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ స్టార్ గా ఫాన్స్ చేత పిలవబడే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్సకత్వంలో పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ సినిమాల్లో ఎంత యాక్ట్ చేసినా, ఫామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తూ,సింపుల్ గా ఉంటాడు. వీరికి అయాన్,అర్హ అనే ఇద్దరు పిల్లలు.

అయితే అల్లు arjun,స్నేహ రెడ్డి ప్రేమ పెళ్లి కావటానికి కొంచెం కష్టపడ్డారనే చెప్పాలి. అయితే పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సామాజిక వర్గాలు వేరుకావడమే కాదు,బన్నీ పాలకొల్లు కుర్రాడైతే , స్నేహారెడ్డి పక్కా తెలంగాణా అమ్మాయి. ఇక బన్నీ, స్నేహారెడ్డి లవ్ విషయంలోకి వెళ్తే ఓ ఫంక్షన్ లో స్నేహారెడ్డిని చూసి బన్నీ మనసు పారేసుకున్నాడు.

కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం కలిగినా, ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకు న్నాక , ఇద్దరు ఇష్టపడుతున్నట్లు తెలిసాక గ్యాప్ తగ్గిపోయింది. తమతమ పేరెంట్స్ కి చెప్పడం పెళ్ళికి అడగడంతో కొంత వ్యతిరేకత వచ్చిందట. అయితే వాళ్ళిద్దరి ప్రేమలోని నిజాయితీ తెలుసుకుని పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.