హన్సిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా… నమ్మలేని నిజాలు
దేశముదురుతో కుర్రకారుని హుషారెత్తించిన హన్సిక తక్కువ సమయంలో 50సినిమాలు చేసింది. ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలయ్య సరసన జయప్రద క్యారెక్టర్ తో ఓలమ్మి తిక్కరేగిందా పాటకు స్టెప్పులు వేసింది. దక్షిణాది లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె బన్నీతో కల్సి దేశముదురులో చేసి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. తెలుగులో ఛాన్స్ లు లేకున్నా తమిళనాట ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. 1991ఆగస్టు 9న ముంబయిలో జన్మించిన ఈమె పూర్తిపేరు హానిక ముక్త్వాల్. ఈమెకు ఓ తమ్ముడున్నాడు. సింధీ వీళ్ళ మాతృభాష. వీరు బౌద్ధమతం ఆచరిస్తారు.
ఈమె తండ్రి ప్రదీప్ వ్యాపార వేత్త. తల్లి మోనా చర్మవ్యాధుల వైద్యురాలు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వాలే అపార్ట్ మెంట్ లో నివసించేవారు. హన్సిక ముంబయి ఇంటర్ నేషనల్ స్కూల్లో ఇంటర్ వరకూ చదివి, తరువాత డిగ్రీ పట్టా కూడా అందుకుంది. చిన్నతనం నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొనేది. తన అందంతో కుర్రకారుకి మత్తెక్కించిన హన్సిక తాను శింబుకే సొంతమని అప్పట్లోనే ప్రకటించి సంచలనం సృష్టించింది.
శింబుతో యవ్వారం బెడిసి కొట్టడంతో ఇక కెరీర్ పైనే దృష్టి పెడతానని ప్రకటించి ఆదిశగా అడుగులు వేసింది.
ప్రయాణంతో లోకమంతా చుట్టిరావడం ఇష్టమని,రకరకాల వంటలు చేయడం ఇష్టమని హన్సిక చెబుతోంది. చిన్నతనంలోనే చాలా సినిమాల్లో , సీరియల్స్ లో నటించిన హన్సిక 2001నుంచే షకలక భూమ్ , అండోహై వంటి సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అబ్రక దబ్రా, జాగో వంటి మూవీస్ లో కూడా కనిపించింది. 2007లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈమె ఫిలిం ఫెర్ అవార్డు కూడా అందుకుంది.
2008లో కంత్రీ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటించినా,పెద్దగా ఆడలేదు. ఐతే ఆతర్వాత రామ్ తో మస్కా మూవీ చేసి మళ్ళీ గుర్తింపు తెచ్చుకుంది. భిల్లా సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. జయీభవ మూవీలో కళ్యాణ్ రామ్ పక్కన చేసినా, నితిన్ సీతారాముల కళ్యాణం మూవీ చేసినా రెండు దెబ్బకొట్టాయి. ఇక 2011లో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమా ప్లాప్ అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇక అబ్కా సరోర్ సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టి కొన్ని సినిమాలు చేసింది.
తమిళంలో బాలు, మాల్ కరాటే,బిర్యానీ వంటి మూవీస్ తో హిట్ అందుకుంది. మంచు విష్ణుతో పాండవులు పాండవులు తుమ్మెద మూవీ చేసినా ఫలితం దక్కలేదు. అయితే రవితేజాతో పవర్ మూవీ చేసి హిట్ అందుకుంది. విలన్ అనే సినిమా మళయాళంలో కూడా చేయడంతో తమిళ, మళయాళం మూవీస్ లో మంచి పేరు తెచ్చుకుంది. గోపీచంద్ తో గౌతమ నంద మూవీ చేసినా ఫలితం లేదు. ఇక తమిళంలో ప్రభుదేవాతో మూవీ చేసి గుర్తింపు నిలబెట్టుకుంది.
సినిమా జీవితమే కాకుండా ప్రతియేటా పుట్టినరోజు నాడు ఓ అనాధ అమ్మాయి గానీ, అబ్బాయిని గాని దత్తత తీసుకుని చదివిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే హన్సిక 25మంది పిల్లలకు చదువుకోసం ఆర్ధిక సాయం చేస్తోంది. రొమ్ము కాన్సర్ తో బాధపడుతున్న మహిళల్లో 10మందికి వైద్య అవసరాలను తీరుస్తోంది. రొమ్ము కేన్సర్ అవగాహనకు చెన్నై బ్రాండ్ అంబాసిడర్ గా ఈమెను పిలుస్తున్నారు. ఇక ఫోర్డ్స్ జాబితాలో 2014 లో 250మంది ప్రముఖుల జాబితాలో 100వ స్థానం సాధించింది.