Movies

సీరియల్ నటి మీనా కుమారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా… ఇంత క్రేజ్ రావటానికి కారణం?

ప్రస్తుతం వెండితెర కన్నా బుల్లితెర మీద చాలా పాపులారిటీ వస్తోంది. అందుకే వివిధ సీరియల్స్ లో నటించే నటీనటులకు జనంలో మంచి ఫాలోయింగ్ ఉంటోంది. అందులో మీనాకుమారి ఒకరు. చిలసౌ స్రవంతిగా ఆరేళ్లపాటు టివి సీరియల్ రావడంతో బుల్లితెరను ఏలింది. జెమిని సీరియల్స్ రారాణిగా ఈ సీరియల్ నిల్చింది. ఈమె నటనకు కన్నీటి వర్షం కురిసేది. సీరియల్ చూసేవాళ్ళు కన్నీటితో తడిసి ముద్దయ్యేవారు. ఇక గతంలో పాత హిట్ సినిమా పేర్లను ఎక్కువగా పెడుతూ సీరియల్స్ వస్తుంటే,చిలసౌ స్రవంతి కొత్తదనం సంతరించుకుంది. ట్రెండ్ కూడా క్రియేట్ చేసుకుంది.

సీరియల్స్ చేస్తూనే సినిమాలకు మళ్లింది. సినిమాల్లో వచ్చిన ఛాన్స్ లు ఉపయోగించుకుంటూ తనదైన నటనతో అలరించింది. గుంటూరు జిల్లాకు చెందిన మీనాకుమారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి,తల్లి గృహిణి. సీరియల్స్ లో బిజీగా ఉండగానే, తెలుగు,తమిళ సీరియల్ ఆర్టిస్ట్ వాసుని పెళ్లి చేసుకుంది. మీనాకు ఇద్దరు పిల్లలు. భార్య భర్తలిద్దరూ తెలుగు,తమిళ టివి రంగాలను ఏలేస్తూ,రెండు చేతులా సంపాందిస్తున్నారు.

సినిమాలను,సీరియల్స్ ని బాలన్స్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వివాదాలకు వెళ్లకుండా నటనతో రాణిస్తోంది. పవర్, మిర్చి,పండుగ చేస్కో,వేంకటాద్రి ఎక్స్ ప్రెస్,స్టాలిన్,జయమ్ము నిశ్చయమ్మురా,జనతా గారేజ్,వంటి మూవీస్ లో నటించి సినీ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. జనతా గ్యారేజ్ లో రాజీవ్ కనకాల భార్యగా మీనా నటనకు ప్రశంసలు లభించాయి.