Movies

చరణ్‌ బర్త్‌డేకు బన్నీ అలా ఎందుకు ప్లాన్‌ చేసాడో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే జనానికి బాగా కనెక్ట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో కమిట్‌ అయిన మూవీ తెరకెక్కబోతుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ మూవీ హ్యాట్రిక్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల టాక్. ఇక మెగా ఫ్యాన్స్‌ అయితే చాలా నమ్మకంతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఎప్పుడెప్పుడా అంటూ వీరి మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈనెల 27న చిత్రంను పట్టాలెక్కించబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో బన్నీ అండ్‌ టీం హ్యాపీ న్యూస్‌ అందించినట్లైంది. ఎందుకంటే, త్రివిక్రమ్‌ కూడా అరవింద సమేత చిత్రం పూర్తి చేసి చాలా రోజులు అయ్యింది. అప్పటి నుండి కూడా బన్నీకోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి చేసి ఉన్నాడు.

ఎట్టకేలకు మూవీని ప్రారంభించేందుకు సిద్దం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను కూడా సెలెక్ట్ చేసారు. అంతా చకచక జరుగుతున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ తేదీని మార్చి 27 అంటూ నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి అనుకుంటున్నారా సరిగ్గా అదేరోజు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ బర్త్‌డే కదా. అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రామ్‌ చరణ్‌ బర్త్‌డే రోజున తన సినిమా ప్రారంభించేందుకు అల్లు అర్జున్‌ ఎందుకు సిద్దం అయ్యాడు అంటూ చర్చ స్టార్ట్ అయింది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం రామ్‌ చరణ్‌ ఆశీస్సులు తీసుకుని ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బర్త్‌డే రోజున ప్రారంభించాలని బన్నీ భావిస్తున్నాడని కొందరు మెగా ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. అయితే చరణ్‌కు కౌంటర్‌గానే ఆ రోజున బన్నీ సినిమా ప్రారంభిస్తున్నాడని మరి కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.