Movies

డైరెక్టర్స్ గా మెగాఫోన్ పట్టుకొని సక్సెస్ అయినా హీరోయిన్స్

సినిమాకి నటీనటులు ఎంత ముఖ్యమో అంతకంటే డైరెక్టర్ కీలకం. ఎందుకంటే సినిమాకు కెప్టన్ ఆప్ ది షిప్ లాంటి వాడు డైరెక్టెర్ . ఆ నౌకను సమర్థవంతంగా నడిపితే సినిమా సూపర్ హిట్. ఇప్పుడు ఆ నౌకను నడిపేందుకు కొందరు హీరోయిన్స్ రెడీ అంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఆ ఫీల్డ్ లో రాణిస్తే.. ఇప్పుడు మరి కొంత మంది సమాయత్తం అవుతున్నారు. నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ళు గతంలో చాలామందే ఉన్నారు. తెలుగు విషయానికొస్తే..అప్పట్లో భానుమతి చండీరాణి వంటి పలు సినిమాలను డైరెక్టర్ చేసింది.

అదే బాటలో సావిత్రి కూడా ‘చిన్నారి పాపలు’, మాతృదేవత వంటి కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసింది. ‘మీనా’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న విజయనిర్మల ఆ తర్వాత ప్రపంచంలో అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఇక వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తగా, ఇప్పుడు మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు.

తెలుగులో జీవిత డైరెక్టర్ గా మారి తన భర్త డాక్టర్ రాజశేఖర్ తో ‘శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, ‘సత్యమేవ జయతే’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసి సత్తా చాటింది. బాలీవుడ్ విషయానికొస్తే..ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కూడా ‘ ఏ దిల్ ఆషియానా’ సినిమాతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకోగా, హీరోయిన్ నందితా దాస్ ‘ఫిరాక్’, భవందర్’ వంటి సినిమాలతో దర్శకురాలిగా సత్తా చాటింది.

హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన పూజా భట్..కూడా ‘పాప్’,జిస్మ్ 2’ వంటి పలు సినిమాలను డైరెక్ట్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. తాజాగా ‘మణికర్ణిక’ సినిమాతో హీరోయిన్ కంగనా రనౌత్ మెగాఫోన్ పట్టేసింది. నిజానికి ఈ సినిమాను కంగనా.. క్రిష్‌తో కలిసి డైరెక్ట్ చేసింది.
ఇక తాజాగా సోనమ్ కపూర్, దియా మీర్జా లాంటి హీరోయిన్స్ కూడా సినిమాలు డైరెక్ట్ చేయాడానికి సన్నద్ధం అవుతున్నారు.

మొత్తానికి ఆన్ స్క్రీన్‌లో నటించడమే కాదు.. బిహైండ్‌ ది స్క్రీన్‌లో దర్శకురాల్లుగా సత్తా చాటారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోయిన్స్ నడుస్తారని అంటున్నారు. అలాగే తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవతి ఆ తరువాత దర్శకురాలిగా మారి, ‘ఫిర్ మిలేంగే’, ‘కేరళ కేఫ్’, ‘ముంబై కటింగ్’ లాంటి సినిమాలను డైరెక్షన్ చేసింది.