లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన అగస్త్య మంజు ఎవరు…. నమ్మలేని నిజాలు
సాధారణంగా సినిమా అంటే ఒకడే డైరెక్టర్ ఉంటాడు. మిగిలినవాళ్లు ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ గానో,అసోసియేటెడ్ డైరెక్టర్ గానో పేరు వేస్తారు. బాగా కష్టపడినా సరే అసోసియేటెడ్ డైరెక్టర్ వరకే పరిమితం చేసేస్తారు. కానీ ఇప్పుడు తెలుగులో వస్తున్న సంచలనాత్మక చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఇద్దరు డైరెక్టర్లున్నారు.నిజానికి ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ సినిమానే అని అందరికీ తెల్సు . అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా చేరాడు. టైటిల్స్ లో కూడా ఇద్దరి పేర్లు వేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్ లో ఇద్దరి పేర్లు పడ్డాయి. అయితే హాలీవుడ్ మూవీస్ కి ఇద్దరేసి డైరెక్టర్స్ ఉంటారు. బాలీవుడ్ లో కూడా డైరెక్టర్ జోడీలున్నాయి.
అలాగే తెలుగు కుర్రాళ్ళు రాజ్,కృష్ణ డీకే ఇద్దరూ కల్సి డైరెక్షన్ చేస్తారు. అదేరీతిలో తనతో పాటు పనిచేసిన వ్యక్తికి టైటిల్ కార్డులో తన పక్కనే చోటిచ్చాడు విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. టైటిల్ లో రామ్ గోపాల్ వర్మ అనే చోట పక్కనే అగస్త్య మంజు అనే టైటిల్ వేసాడు. అగస్త్య మంజు చాలా సినిమాలకు వర్మ దగ్గర పనిచేసాడు. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ లో కూడా చేయివేసాడు. ఇతడి అసలు పేరు మంజు మదనేని. అయితే అగస్త్య అనే పేరు వర్మ చేర్చి అగస్త్య మంజు గా మార్చాడు.
బాలీవుడ్ లో కూడా పేరు కావాలంటే పేరులో కొంత లోతైన విషయం ఉండాలని వర్మ అంటాడు. గతంలో జయకుమార్ అనే స్క్రిప్ట్ రైటర్ తాను రాసిన ఆఫీసర్ అనే కథను వర్మ వాడేసుకున్నాడని,అయితే తనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని వార్తల్లోకి ఎక్కాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బాగా పనిచేసి,స్క్రిప్ట్ వర్క్ లో కూడా పాలుపంచుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా తన పేరు పక్కన మంజు పేరు వేసాడని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా తన పక్కనే మరో వ్యక్తికీ డైరెక్టర్ గా చోటివ్వడం అంటే వర్మ గొప్పతనానికి నిదర్శనమని అంటున్నారు. ఇక ఈ సినిమా మార్చి22న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.