MoviesTollywood news in telugu

ఈ సినిమాలు ప్లాప్ కావటానికి కారణాలు ఏమిటో తెలుసా?

Tollywood Stars flop movies: మన స్టార్ హీరోల సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నిరాశ పరుస్తాయి. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.
ఖలేజా

త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి మహేష్ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో మనం ఈ సినిమాలో చూశాం. ఎప్పుడూ చూడనటువంటి మహేష్ బాబు సరికొత్త యాక్టింగ్ ఈ సినిమాలో చూడవచ్చు. హీరోని దేవుడిని చేసే కాన్సెప్ట్ ను కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటే, మరికొంతమంది నెగటివ్ గా తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ను అర్ధం చేసుకున్నవాళ్ళు సినిమా హిట్ అన్నారు.. అర్ధం చేసుకోలేని వాళ్ళు సినిమా ఫ్లాప్ అన్నారు అంతే తేడా.

ఆరెంజ్
ram charan orange
టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీతో సినిమా రావడం ఇదే మొదటిసారి అనుకుంటా. ప్రేమకథతో తెరకెక్కిన సినిమాలు మనం ఇప్పటివరకు చాలానే చూసుంటాం. కానీ ఈ సినిమా లవ్ స్టోరీస్ అన్నింటికి తోపు అనొచ్చు. నిజాలు చెప్పి ప్రేమించడం, ఎక్కువ కాలం ప్రేమ ఉండదు అనే భిన్నమైన కాన్సెప్ట్ కొంతమంది ఆడియన్స్ కి ఎక్కక.. సినిమా బాగాలేదు అనేశారు. అర్ధం చేసుకున్నవాళ్ళు మాత్రం ‘ఆరెంజ్’కి ఫిదా అయిపోయారు.

1- నేనొక్కడినే

సుకుమార్ సినిమా అంటే బోలెడన్ని లాజిక్స్ అండ్ క్రియేటివిటీ ఉంటుంది. మరి అతని సినిమాలను అర్ధం చేసుకోవాలంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. ‘1- నేనొక్కడినే’ సినిమా కూడా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటేనే అర్ధమవుతుంది. ఈ సినిమాకు కల్ట్ ఫాన్స్ ఇప్పటికీ ఉన్నారు. టీవీ లో ఎప్పుడు వేసినా..టీవీ సెట్స్ కు అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు.

రాఖీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన సినిమా ‘రాఖీ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. చెల్లికి జరిగిన అన్యాయాన్ని తిప్పికొట్టి సమాజం మీద ఓ యువకుడు జరిపిన పోరాటమే ఈ చిత్ర కథ. తారక్ ను ఎక్కువగా మాస్ హీరోగా మనం చూస్తుంటాం.. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ పండించిన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయినా ఎక్కడో తేడా కొట్టేసింది.