సిద్దార్థ టాప్ హీరో కావడం వెనుక నితిన్ ఉన్నాడా? నమ్మలేని నిజాలు

ఇండస్ట్రీలో ఒక్కోసారి పరిస్థితిలు ఎలా మారతాయి. ఒకరికి వచ్చిన ఛాన్స్ మిస్సయితే అది మరొకరికి వరం అవుతుంది. ఇక బొమ్మరిల్లు మూవీతో అంతా మీరే చేసారు అంటూ తండ్రిని నిలదీసే పాత్రలో సిద్ధార్ధ్ నటన అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగులోనే కాదు ,బాలీవుడ్ ,కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న హీరో సిద్ధార్ధ తెలుగు ఆడియన్స్ కి బానే దగ్గరయ్యాడు.

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే సిద్ధార్ధ్ హీరో కావడానికి పరోక్షంగా యువ హీరో నితిన్ దోహదం చేసాడట. జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఆ సినిమా కోసం డైరెక్టర్ తేజ తీసిన ఫోటో షూట్ రిలీజ్ అవ్వడంతో అది చూసిన డైరెక్టర్ వివి వినాయక్ తాను తీసిన దిల్ మూవీలో నితిన్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక తమిళ డైరెక్టర్ శంకర్ కూడా నితిన్ కోసం హైదరాబాద్ వచ్చి తమిళ మూవీలు యాక్ట్ చేయమని అడిగాడట.
ఇక శంకర్ అడిగిన డేట్స్ ,జయం మూవీకి ఇచ్చిన డేట్స్ ఒకటే కావడంతో ఇక చేసేది లేకపోయింది.

సో ఆ విధంగా టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ఛాన్స్ మిస్సయ్యాడు. ఇక శంకర్ డైరెక్షన్ లో వద్దనుకున్న ఆ సినిమా బాయ్స్. అయితే తెలుగు ,తమిళ , హిందీ భాషల్లో విడుదలై హిట్ కొట్టింది. అప్పటికే డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న సిద్ధూ ఈ సినిమాకు హీరో అయ్యాడు. ఈ సినిమా సిద్ధూకి క్రేజ్ తేవడమే కాదు , ఆఫర్స్ కూడా తెచ్చిపెట్టింది.