జగన్ గురించి 5 నమ్మలేని నిజాలు
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరం అయ్యారు. ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న ఉద్దేశ్యంతో పాదయాత్ర చేపట్టి పూర్తిచేశారు. మొత్తం 13 జిల్లాల్లో 125 నియోజక వర్గాల మీదుగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి శ్రీకారం చుడతున్నారు. డాక్టర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చారు. అయితే ఆయన సడన్ గా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో జగన్ సీఎం అవుతారని అందరూ భావించినా కుదరలేదు.
కొన్నాళ్ళు కాంగ్రెస్ లో కాలక్షేమం చేసినా సరే, ప్రయోజనం లేకపోవడంతో కాంగ్రెస్ ను వదిలిపెట్టి వైస్సార్ కాంగ్రెస్ స్థాపించారు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకూ చదువుకున్న జగన్,నిజాం కాలేజీలో బికాం చేసారు. ఇక ఎంబీఏ కోసం లండన్ వెళ్లారు. అయితే అది పూర్తిచేయకుండా వచ్చేసారు. ఇక కడపలో నందమూరి బాలకృష్ణ ఫాన్స్ ప్రెసిడెంట్ గా జగన్ ఉండేవారట.
సమరసింహారెడ్డి,చెన్నకేశవ రెడ్డి వంటి మూవీస్ వలన జగన్ ఇలా బాలయ్య ఫ్యాన్ అయ్యాడని అంటారు. ఇప్పటికీ వీలుచిక్కినపుడు బాలయ్య సినిమాలు చూస్తుంటాడని అంటున్నారు. ఇక బెంగుళూరులో ఆంద్ర ఆక్టోపస్ గా పలువబడే లగడపాటి రాజగోపాల్ కి చెందిన లాంకోస్ లో జగన్ పనిచేసేవాడట. భారతిని పెళ్లిచేసుకున్న జగన్ కి వర్ష, హర్ష అనే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు వర్ష లండన్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సంపాదించి సంచలనం సృష్టించింది.
అప్పట్లో పలు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఆతర్వాత 2014జనరల్ ఎన్నికల్లో 5లక్షల ఓట్ల తేడాతో చాలా సీట్లు కోల్పోయారు. 175నియోజక వర్గాల్లో 70చోట్ల విజయం సాధించారు. దాంతో టీడీపీ అధికారంలోకి వచ్చేసింది. ఇక ఈసారి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. వచ్చే ఏప్రియల్ 11న రాష్ట్రంలో అసెంబ్లీకి,పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసిన వెంటనే జగన్ ఏపీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక పలు సర్వేలు కూడా వైస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.