హోళీ ఏ రోజు జరుపుకోవాలి…. మార్చి 20…? లేదా మర్చి 21….?
హోలీ అనేది రంగుల పండుగ, వసంత కాలంలో వచ్చే హోలీ పండుగను భారతదేశం మొత్తం జరుపుకున్నా ,దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలో బాగా ఘనంగా జరుపుకుంటారు. 2019 వ సంవత్సరంలో హోలీ పండుగ ఏ రోజున వస్తుంది. ఏ రోజు జరుపుకోవాలి. హోలీ పండుగ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిది రోజున జరుపుకుంటారు. అయితే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిధి మార్చి 20 న ప్రారంభం అయ్యి మార్చి 21 వరకు ఉంటుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పండుగను అయినా సూర్యోదయంలో ఏ తిది ఉంటే దాని ప్రకారం పండుగలను జరుపుకుంటాం. హోలీ పండుగను పౌర్ణమి రోజు జరుపుకుంటాం కదా. పౌర్ణమి తిది ఎప్పుడి నుండి ఎప్పటి వరకు ఉందో వివరంగా తెలుసుకుందాం.
పొర్ణమి తిధి మార్చి 20 వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రారంభం అయ్యి మార్చి 21 వ తారీఖు గురువారం ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు ఉంది. మార్చి 20 వ తారీఖు బుధవారం రోజు పౌర్ణమి తిధి చాలా ఎక్కువ సమయం ఉంటుంది. కానీ గురువారం కేవలం ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు మాత్రమే పౌర్ణమి తిధి ఉంటుంది. అంటే గురువారం పౌర్ణమి తిధి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. తక్కువ సమయం ఉన్నా సరే గురువారం సూర్యోదయానికి పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి ఆ రోజే హోలీ పండుగను జరుపుకోవాలి. అంతేకాని బుధవారం పౌర్ణమి తిధి ఎక్కువ సమయం ఉందని ఆ రోజు హోలీ పండుగను జరుపుకోకూడదు.