సునీల్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా…. నమ్మలేని నిజాలు
నువ్వే కావాలి మూవీ ద్వారా తెలుగు తెరకు హాస్య నటుడుగా పరిచయమైన భీమవరం బుల్లోడు సునీల్ అనతికాలంలోనే స్టార్ కమెడియన్ అయ్యాడు. దాదాపు 180చిత్రాల్లో హాస్యనటుడిగా చేసిన సునీల్, అందాల రాముడు మూవీతో హీరోగా చేసి,భారీ విజయాన్ని అందుకున్నాడు. 100రోజులు ఆడింది. కొన్ని చిత్రాల్లో హీరోగా చేసినా,మళ్ళీ కమెడియన్ గా తన ప్రస్థానం సాగిస్తున్నాడు. ఏపీలోని భీమవరం దగ్గర పెద్దపల్లి గ్రామంలో1974ఫిబ్రవరి 28న జన్మించిన సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. తండ్రి పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ,సునీల్ కి ఐదేళ్ల వయస్సు ఉండగా మరణించడంతో తల్లికి ఆ ఉద్యోగం ఇచ్చారు.
అమ్మమ్మ ఊళ్ళో పెరిగిన సునీల్ అక్కడే 4వ తరగతి వరకూ చదివి,ఆతర్వాత ఇంటర్ వరకూ భీమవరంలో చదివాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో హీరోగా రాణించాలన్న కోరికతో భీమవరం కాలేజీలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరాడు. ఫ్రెండ్స్ తో సినిమాలు ఎక్కువగా చూసే సునీల్ ఒకసారి చిరంజీవిగా డాన్స్ చేయాలని భావించి డాన్స్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. సినిమాల్లో చేరాలన్న ఉద్దేశ్యంతో తన బైక్ అమ్మేసి,ఆ డబ్బులతో 1994లో హైదరాబాద్ వచ్చిన సునీల్ ఫిలిం నగర్ లో ఛాన్స్ ల కోసం తిరుగుతుంటే,ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న అయన మిత్రుడు మురళీ,అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కల్సి ఒక రూమ్ లో ఉన్నారు.
అలా త్రివిక్రమ్ తో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. సినీ ఛాన్స్ లకోసం తిరిగి,విలన్ వేషాలు ఇమ్మని అడిగినా రాకపోవడంతో భీమవరం వచ్చేసిన సునీల్ మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్ మెంట్ తో హైద్రాబాద్ వచ్చాడు. అలా రెండుళ్లు తిరగ్గా తిరగ్గా అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి అనే మూవీలో చిన్న పాత్ర చేసాడు. ఇక నువ్వే కావాలి మూవీతో కమెడియన్ గా ఆడియన్స్ ని నవ్వించి ఆకట్టుకున్నాడు. చివురునవ్వుతో,చిరుజల్లు మూవీస్ పెద్దగా గుర్తింపు రాకున్నా, నువ్వు నేను మూవీ బ్రేక్ తెచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కొట్టేసాడు.
ఇక పెద్దల సమక్షంలో శృతి అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీరికి ఒక పాప,ఒక కుమారుడు ఉన్నారు. నువ్వు నాకు నచ్చావ్,మనసంతా నువ్వే,తొలివలపు,నువ్వు లేక నేను లేను,కలుసుకోవాలని,వాసు,సంతోషం వంటి ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆడియన్స్ కి సునీల్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఇంద్ర,హోలీ,మన్మధుడు, వసంతం,లక్ష్మి నరసింహ,వర్షం,మల్లీశ్వరి లాంటి మూవీస్ మరింత గుర్తింపు పొందాడు. ఆంధ్రుడు సినిమాలో చేసి నంది అవార్డు,పెదబాబు సినిమాతో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు.
2006లో అందాల రాముడుతో హీరోగా ఎదిగిన సునీల్ ఆసినిమా సమయంలో ఈ సినిమాను ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అని చాలా ఆవేదన చెందాడట. ఆ సినిమాలో చేసిన డాన్స్ ని తన అభిమాన హీరో చిరంజీవికి చూపిస్తే ఆయన మెచ్చుకున్నారని సునీల్ పొంగిపోయాడు. ఆతర్వాత రాజమౌళి తీసిన మర్యాద రామన్న మూవీలో హీరోగా చేసి హిట్ కొట్టాడు. తర్వాత ఖలేజా ,మిరపకాయ్ మూవీస్ లో కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. 2011లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో కథ ,స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే మూవీలో నటించాడు.
ఇక్కడ విషయం ఏమిటంటే ఛాన్స్ లకోసం తిరిగేటప్పుడు అవకాశం ఇవ్వని వర్మ ఆతర్వాత అయన సినిమాలో హీరోగా ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయంగా సునీల్ తెల్పాడు. నాగ చైతన్య తో కల్సి సపోర్టింగ్ యాక్టర్ గా చేసిన తడాఖా సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. భీమవరం బుల్లోడు,కృష్ణాష్టమి,వీడు గోల్డ్,ఉంగరాల రాంబాబు,వంటి మూవీస్ కలెక్షన్స్ తేలేకపోయాయి.