‘జబర్థస్త్’ వార్.. రోజా వర్సెస్ నాగబాబు
మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరికొంత మంది ఏకంగా ముఖ్యమంత్రలు కూడా అయ్యారు. తాజాగా ఏపీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జబర్థస్త్ జడ్జెస్‌గా ఫేమసైన నాగబాబు, రోజాలు పొలిటికల్‌గా వైరీ పక్షంగా ఉన్న చెరో పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే రోజా..వైయస్ఆర్సీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇపుడు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ తరుపున నగరి నుంచి మరోపారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది. తాజాగా జబర్థస్త్ జడ్జి నాగబాబు..తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు.ఈ రకంగా జబర్థస్త్ యాంకర్స్‌గా పనిచేస్తోన్న వీరిద్దరు చెరో పార్టీ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే..మరొకరు ఎంపీగా పోటీచేస్తున్నారు. మొత్తానికి ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో జబర్థస్త్ జడ్జెస్ రోజా, నాగబాబు ఏ మేరకు ప్రభావం చూపెడతారో చూడాలి.