హరిత బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా …. ఆమె వారం సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
పెళ్లి సందడి సినిమాలో మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే పాటతో పాపులర్ అయిన నటి రవళి ఇప్పుడు ఎక్కడుందో గానీ, ఆమె అక్క హరిత మాత్రం బుల్లితెరపై తన హవా కొనసాగిస్తోంది. ఈమె హైలెవల్ లో రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఈమె సినిమాల్లో ఎక్కువగా సిస్టర్ క్యారెక్టర్స్ వేసేది. చినరాయుడు ,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ తో పాపులర్ అయింది. అయితే హీరోయిన్ అవ్వాలని కోరిక తీరలేదు.కేవలం సిస్టర్ పాత్రలకే పరిమితం చేయడంతో ఇక బుల్లితెరపై దృష్టి పెట్టింది.
హరిత ఏది కావాలనుకుందో అది టివి రంగంలో దొరకడంతో అప్పుడప్పుడు సినిమాల్లో నటించినప్పటికీ టివి రంగానికే అతుక్కుపోయింది. ఆ విధంగా టివి రంగంలో వారానికి 10 లక్షలు చొప్పున నెలకు మొత్తం మీద 40నుంచి 50లక్షలు అందుకుంటోందని అంటున్నారు. ఇక టివి రంగంలో జాకీ పరిచయం కావడం,ఇక ఆమె అన్న శేషగిరి ఫ్రెండ్ కావడం వలన ఇంటికి వస్తూ పోతూ ఉండడం వలన అతడికి హరితను ఇచ్చి పెళ్లి చేయాలనీ నిర్ణయించారు.
ఆవిధంగా ఇద్దరికీ లవ్ మొదలై, పెళ్లి కి దారితీసింది. ఇక హరిత,జాకీలకు ఇద్దరు పిల్లలున్నారు. ఇక పిల్లలు పెరిగి పెద్దయ్యాక హరిత కలవారి కోడలు సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ముద్దముద్దరం సీరియల్ లో అఖిలాండేశ్వరి పాత్రతో దూసుకుపోతోంది. నిజానికి ఆనాడు ముందు చూపుతో టివి రంగానికి వెళ్లడం వలన హరితకు మంచి ఫలితం వచ్చింది. భార్య భర్తలిద్దరూ టివి నటులే కావడంతో రెండు చేతులా సంపాదన కొనసాగుతోంది.