Movies

నరేష్ గురించి మనకు తెలీని నిజాలు….మూడు పెళ్లిళ్లు చేసుకోవటానికి కారణం ఏమిటో తెలుసా?

ప్రేమ సంకెళ్లు మూవీ ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరో నరేష్ చాలా సినిమాల్లో హీరోగా రాణించాడు. గిన్నిస్ బుక్ లో ఎక్కిన ప్రముఖ మహిళా డైరెక్టర్ విజయనిర్మల కుమారుడైన నరేష్ హీరోగా, ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజకీయాల్లో కూడా చేరి,సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన శైలిలో వెళ్తున్నాడు. ఇక తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)అధ్యక్షుడిగా శివాజీరాజాపై 69ఓట్ల ఆధిక్యంతో ఎన్నికయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళ,హిందీ భాషల్లో నటించి మెప్పించిన నరేష్ అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. సొగసు చూడ తరమా మూవీ కి నంది అవార్డు అందుకున్నాడు. 1960జనవరి 20న చెన్నైలో విజయనిర్మల ,కృష్ణమూర్తి దంపతులకు జన్మించిన నరేష్ తండ్రితో విబేధాల కారణంగా తల్లి విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగాడు.

రామకృష్ణ మిషన్ హైస్కూల్,హిందూ హైస్కూల్ లలో స్టడీస్ పూర్తిచేసిన నరేష్ బాలభవన్ లో కాలేజీ ఎడ్యుకేషన్ పూర్తిచేసాడు. 1970లో రెండు కుటుంబాల కథ మూవీలో నరేష్ బాలనటుడిగా కనిపించాడు. అయితే 1972లో సూపర్ కృష్ణ హీరోగా వచ్చిన పండంటి కాపురం మూవీలో బాలనటుడిగా నరేష్ మొదటి మూవీ గా చెప్పుకొస్తారు. పండంటి కాపురం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొంది,కవిత,సౌభ్యాగ్యమ్ వంటి మూవీస్ లో నరేష్ నటించాడు.

1980లో ప్రేమ సంకెళ్లు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ కి ఆ మూవీ బ్రేక్ ఇవ్వలేదు. అయితే అదే ఏడాది జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన నాలుగు స్తంభాలాట మూవీ విజయం సాధించడంతో హీరోగా బ్రేక్ వచ్చేసింది. ఆ మూవీలో చినుకులా రాలి సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిల్చింది. మొదట్లో లవ్ స్టోరీస్ లో నటించిన నరేష్ ఆతర్వాత కామెడీ మూవీలో నటించి మెప్పించాడు. పుత్తడి బొమ్మ ,అగ్ని సమాధి,రెండు జెళ్ళ సీత,ఊహా సుందరి,శ్రీవారికి ప్రేమలేఖ, శ్రీవారి శోభనం,చూపులు కల్సిన శుభవేళ,బావా బావా పన్నీరు వంటి మూవీస్ లో నటించి ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

ఇక ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన జంబలికడి పంబ మూవీ కామెడీ మూవీస్ లోనే ట్రెండ్ సెట్టర్ అయింది. ముఖ్యంగా దర్శకుడు జంధ్యాల తన కెరీర్ లో నరేష్ కి ఎన్నో మరపురాని చిత్రాలను అందించి నటుడిగా నిలబడేందుకు ఊతమిచ్చారు. శ్రీవారికి ప్రేమలేఖ మూవీలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ సాంగ్ ఇప్పటికే వర్ధమాన గాయకుల నోట పలుకుతూ ఉంటుంది. సీనియర్ కెమెరా మెన్ శ్రీను కూతురిని పెళ్లిచేసుకున్న నరేష్ కి ఓ బాబు పుట్టాడు. అతడి పేరు నవీన్. అయితే మనస్పర్థల కారణంగా విడిపోయారు.

రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది కూడా విడాకులకు చేరింది. ఇక 50ఏళ్ళ ప్రాయంలో రాజకీయ వేత్త రఘువీరా రెడ్డి సోదరుని కుమార్తె రమ్యను హిందూపురంలో2010డిసెంబర్ 3న పెళ్లిచేసుకున్నాడు. మొత్తం మీద ముగ్గురు కొడుకులున్నారు. పెద్ద కొడుకు హీరోగా పరిచయం కాగా, మిగిలిన ఇద్దరూ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. నాలుగు స్తంభాలాట నుంచి ప్రేమ ఎంతమధురం వరకూ ఎన్నో చిత్రాలు జంధ్యాల డైరెక్షన్ లోనే రావడంతో నరేష్ కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అలా ఎక్కువ చిత్రాలు జంధ్యాల డైరెక్షన్ లోనే వచ్చాయి. అయితే మాజీ ప్రధాని వాజపేయి హయాంలో బీజేపీలో చేరిన నరేష్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నాడు.

ఆ పార్టీ లో జనరల్ సెక్రటరీగా చేసాడు. 2009లో ఎంపీగా పోటీచేసిన నరేష్ ఓడిపోవడంతో బిజెపికి దూరం అయ్యాడు. ఆవిధంగా రాజకీయాలకు దూరమైన నరేష్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం మూవీలో నారద పాత్రతో ప్రత్యేక పాత్రలు చేయడం మొదలు పెట్టిన నరేష్ ఆతర్వాత సొంతం మూవీలో చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించి,బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత 60చిత్రాల్లో చేసాడు. మల్లీశ్వరి,మధుమాసం,మూవీస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి మూవీలో ఓ మంచి పాత్ర వేసి నరేష్ మెప్పించాడు. ఎన్నో అవార్డులు,పురస్కారాలు అందుకున్న నరేష్ తన కెరీర్ ని ఇంకా కొనసాగిస్తూ చురుగ్గా ఉంటున్నారు.