మెగా బ్రదర్ కొడుకు వరుణ్ తేజ్ గురించి టాప్ 10 ఇంటరెస్టింగ్ న్యూస్
టాలీవుడ్ లోకి ‘ముకుంద’గా వచ్చి ‘అంతరిక్షం’ వైపు దూసుకెళ్లిన మెగా ఫామిలీ మెంబర్ వరుణ్ తేజ్ తాజాగా సంక్రాంతికి ఎఫ్2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మొదటినుండి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ, కథల పట్ల తనకున్న చాటుకుంటూ వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ గురించి ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో టాప్ టెన్ అంశాల గురించి తెలుసుకుందాం.
మెగా బ్రదర్ నాగబాబు కొడుకైన వరుణ్ తేజ్ 2000 లో వచ్చిన ‘హ్యాండ్సప్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ సినిమాలో నాగబాబు నటించగా, చిరంజీవి అతిధిపాత్రలో కనిపించారు.
వరుణ్ తేజ్ ఫేవరేట్ యాక్టర్స్ ఎవరంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అని చెబుతాడు.
మెగాప్రిన్స్ 2014 లో ‘ముకుంద’ ద్వారా సినీ అరంగేట్రం చేశాడు. ఈ సినిమాకి మొదటిగా అక్షర హాసన్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ, చివరికి పూజా హెగ్దే ఫైనల్ అయిందట.
వరుణ్ తేజ తన రెండవ సినిమా ‘కంచె’లో అతని నటనకు సినీవర్గాల నుండి ప్రశంసలు పొందాడు. ఇక అప్పటినుండి తనకంటూ ఒక సపరేట్ ట్రెండ్ ని సెట్ చేసుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
మెగా బ్రదర్, పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్ లో శిక్షణ సత్యానంద్ ఇవ్వగా, వరుణ్ తేజ్ కి కూడా ఆయనే నటనలో ట్రైనింగ్ ఇచ్చారట.
వరుణ్ తేజ్, ‘లోఫర్’, ‘మిస్టర్’ వంటి సినిమాలతో బోల్తా పడినప్పటికీ తిరిగి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తో ఫామ్ లోకి వచ్చాడు.
నటనలో వైవిధ్యం కనబరచడంలో బహుశా పెద్దనాన్న చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అనుకుంటా!
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తానేంటో నిరూపించుకున్నాడు.’ఫిదా’ సినిమాతో ఘనవిజయం సాధించి ‘తొలిప్రేమ’ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ రెండు సినిమాలో వరుణ్ తేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
2018 లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అంతరిక్షం 9000 కె ‘ తో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఒక మంచి ప్రయత్నంగా వరుణ్ తేజ్ కు ప్రశంసలు దక్కాయి.
ఇక సంక్రాంతికి వచ్చిన మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’లో వెంకటేష్ తో కలసి థియేటర్లలో నవ్వులు కురిపిస్తున్నాడు. ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3లో కూడా వరుణ్ నటించబోతున్నాడు.