మరో బయో పిక్ కి సిద్దమైన RGV… ఈ సారి ఎవరిదో తెలిస్తే షాక్

ఎప్పుడూ ఏదో వివాదంతో గడిపే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదం రేపుతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో ఆఖరి ఘట్టం ఎలా గడిచిందో వాస్తవాలు వివరిస్తానంటూ ప్రకటించి, ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రం తీసి సెన్షేషన్ సృష్టించాడు. సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంటే, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదల చేసారు. ఇక ఈ మూవీ మంచి మార్కులే కొట్టేయడంతో వర్మ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ సినిమా హిట్ కొట్టడంతో థియేటర్లలో దుమ్మురేపుతోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఉన్నది ఉన్నట్టు అందరికీ చూపించడం ద్వారా వర్మ ఎవరికీ లొంగకుండా వ్యవహరించాడని అంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ పేరిట ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు భాగాలుగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించడం , ఈ రెండు భాగాలూ విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మంచి హిట్ అందుకుంది. వివాదాలుండే కథనే సినిమా కథగా ఎంచుకుని వర్మ సినిమాలు తీస్తుంటాడు.

సినిమా ప్రారంభం రోజునే అందరి కళ్ళూ తన సినిమా వైపే పడేలా చేయడంలో వర్మకు ఎవరూ సాటిరారు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ కి రెడీ అవుతున్నాడు. అయితే తమిళనాట సంచలనంగా నిల్చిన శశికళ జీవితాన్ని తెరకెక్కించబోతున్నాడు. జయలలిత మరణం,శశికళ జైలుపాలవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో శశికళ బయోపిక్ ని తీయాలని వర్మ సిద్ధం అవుతున్నాడు. శశికళ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ ని ట్వీట్ చేసాడు. సినిమా పేరు శశికళగా ప్రకటించాడు.

మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు, మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్స్ కి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఓ బంధం కథ అని చెబుతూ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ మూవీకి సంబందించిన మిగిలిన వివరాలను త్వరలో ప్రకటించనున్నాడు. మొత్తానికి శశికళ బయోపిక్ తో ఎవరి బాగోతం బయటపెడతాడో అని సినీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది.