బ్రహ్మానందం రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా?

తెర మీద కనిపిస్తే చాలు నవ్వులు పూయించే నటుడిగా బ్రహ్మానందం తెలుగు సినీ రంగంలో స్టార్ కమెడియన్ గా ఓ ఊపు ఊపారు. కానీ హఠాత్తుగా ఆయన హార్ట్ ఆపరేషన్ ముంబయిలో జరగడంతో రెస్ట్ లో ఉన్నారు. అందుకే ఇపుడు తెలుగు సినిమా ప్రేక్షకులందరు బ్రహ్మానందం ఎపుడు వెండితెరపై కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఎన్టీఆర్ ..కథానాయకుడు’లో బ్రహ్మానందం..దివంగత రేలంగి పాత్రలో కనిపించి అలరించారు.

కథానాయకుడులో కూడా బ్రహ్మానందం రెండు సన్నివేశాల్లో ఉన్నాడు తప్పించి పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా ఏది చేయలేదు. ఎందుకంటే, గుండెకు బైపాస్ సర్జరీ తర్వాత బ్రహ్మా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ మధ్యే కొన్ని సినిమాలకు సైన్ చేసాడనే టాక్ వచ్చింది. అయితే పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా ఈ నవ్వులరేడు తిరుపతిలో దర్శనం ఇచ్చాడు. అంతేకాదు శ్రీవారి దర్శనం తర్వాత అక్క‌డే నాగ చైత‌న్య‌, స‌మంత‌తో క‌లిసి ఫోటోల‌కు పోజులిచ్చాడు .

ప్ర‌త్యేకంగా స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన బ్ర‌హ్మిని చూసి అభిమానులు కూడా బ్రహ్మానంద భరితులయ్యారు. అంతేకాదు అక్కడ బ్రహ్మానందం మునుపటి కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నాడు. మొత్తానికి శ్రీవారి దర్శనంలో హుషారుగా కనిపించిన బ్రహ్మానందం ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా గుండె ఆపరేషన్ తర్వాత బ్రహ్మా చేయబోయే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.