మజిలీ మూవీ రివ్యూ….. నాగ చైతన్య హిట్ కొట్టినట్టేనా?

కొన్ని సినిమాలకు అమాంతం క్రేజ్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మజిలీ మూవీకి అలాంటి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటించడమే ఇందుకు కారణం. ఈ సినిమా ఏప్రియల్ 5శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. నిను కోరే డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటిప్ టాక్ ముందునుంచి వుంది. క్రికెట్ ,ప్రేమ ,పెళ్లి నేపథ్యం గా సాగే రొమాంటిక్ ఎమోషనల్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టింది. 21.14 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ గా బిజినెస్ జరిగినట్లు టాక్. క్రికెట్ అంటే ఇష్టపడే వ్యక్తి అటు క్రికెట్ కి ,ఇటు ప్రేమించే అమ్మాయికి దూరం కావడమే ఇందులోని సారాంశం.

పూర్తిగా ఫ్యామిలీ సెంటిమెంట్ గల ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇష్టం లేని పెళ్ళిచేసుకుని జీవితంలో ఇబ్బందులు పడుతూ ఎలాంటి జీవితం కొనసాగించాడనేది ఈమూవీలో కీలక అంశం. ప్రీమియర్ షో చూసినవాళ్లు చైతు,సమంత ఒకరికొకరు పోటీ పడుతూ చేసిన నటనకు ముగ్దులవుతారని అంటున్నారు.

ప్రేమలో విఫలమై అనుకున్న లక్ష్యం సాధించలేక నిరాశలో కూరుకుపోయిన పాత్రలో చైతు ఒదిగిపోయాడని విశ్లేషకులు అంటున్నారు. ఇక నిత్యం తాగుతూ ఉండే భర్తను దారిలో పెట్టడానికి తపించే భార్యగా సమంత నటన అద్భుతమని అంటున్నారు. ఈ మూవీ మొదటి భాగం చైతు లవ్ యాంగిల్ లో సినిమా నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు సమంత ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి సమంత చుట్టూ కథ నడుస్తుంది. 2 గంటల 34నిమిషాల నిడివితో సాగిన ఈ మూవీలో చైతు ,సమంత నటన అందరి కళ్ళలో నీళ్లు వచ్చేలా చేసిందని అంటున్నారు.

ఆద్యంతం ఈ మూవీ అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. పైగా క్లైమాక్స్ చూసాక ప్రతిఒక్కరూ బరువెక్కిన గుండెలతో బయటకు వస్తారని అంటున్నారు. ఇక భర్తలైతే తమ భార్యల గురించి ఆలోచన చేస్తూ బయటకు వస్తారన్న మాట వినిపిస్తోంది. ఇక ఈమూవీలో 19ఏళ్ళ యువకుడిగా, 34ఏళ్ళ వయస్సు లో భర్తగా నాగ చైతన్య నటన పండించాడని అంటున్నారు.